మక్తల్ లో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్స వ వేడుకలు 

Published On
మక్తల్ లో ఘనంగా యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్స వ వేడుకలు 

నారాయణపేట ఆగస్టు 9:

యువజన కాంగ్రెస్ స్థాపన 66 సంవత్సరాలు పూర్తయి న సందర్భంగా శనివారం మక్తల్ నియోజకవర్గ కాంగ్రె స్ పార్టీ కార్యాలయంలో మక్తల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేణు గౌడ్ ఆధ్వ ర్యంలో ఆవిర్భావ దినోత్స వ వేడుకలను యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్క రించి ఘనంగా జరుపుకు న్నారు, అంతకు ముందు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీచిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లను మక్తల్ మున్సి పల్ చైర్మన్ వాకిటి మానస, యువజన కాంగ్రెస్ నాయ కులు పంపిణీ చేశారు. యువజన కాంగ్రెస్ నాయ కులు రోగులను పరామ ర్శించి త్వరగా కోలుకోవా లని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మానస , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గణేష్ కుమార్  సీనియర్ నాయకులు కట్ట సురేష్ , మాజీ జడ్పీటిసి గవినోల్ల లక్ష్మారెడ్డి , ఆనంద్ గౌడ్ , అమర్ రెడ్డి , శంకర్, ఓబులేష్ ,నీలగౌడ్ ,గోవర్ధన్, గుంతలి రవి, గుడేబల్లూ రు నాగరాజు , మక్తల్ మండల అధ్యక్షులు శ్రీని వాస్ గౌడ్ ,మాగనూరు మండల అధ్యక్షులు శివ రాం రెడ్డి  మాట్లాడుతూ . జవహర్ లాల్ నెహ్రూ  ఆశ యాలతో,  స్వర్గీయ ఇంది రాగాంధీ ,యువజన కాంగ్రె స్ను పునర్ వ్యవస్థీకరించి యువతను రాజకీయా ల్లోకి, ప్రజా జీవితంలోకి, సేవా కార్యక్రమాల్లోకి తీసు కొచ్చారని గుర్తు చేశారు. దేశభక్తి, సేవా భావం, క్రమ శిక్షణను ప్రతి యువకుడు అలవర్చుకోవాలని పిలు పునిచ్చారు. ఈ దేశంలో యువకులకు న్యాయం చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలి పారు.యువజన కాంగ్రె స్,ఎం ఎస్ యు ఐ నాయ కులు మాట్లాడుతూ కేంద్రం లోని మోడీ బిజెపి ప్రభు త్వం గత 12 ఏళ్లుగా యువతకు తీరని అన్యా యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను మోసం చేశారు. పేపర్ లీకులు,అగ్నివీర్ పథకంతో సైన్యంలో శాశ్వత ఉద్యోగా లను తీసేశారు. విద్యను కార్పొరేట్ పరం చేసి ఫీజు లు పెంచారన్నారు.ఇటీవల జెన్ జి ఉద్యమం పేరుతో యువత రోడ్లపైకి వచ్చి నిరుద్యోగం, అవినీతి, ధరల పెరుగుదలపై ప్రశ్నిం చిందని, కానీ బిజెపి ప్రభు త్వం లాఠీలతో అణిచివేసే ప్రయత్నం చేసిందని ఖండించారు.ఆర్ఎస్ఎస్, బిజెపి విభజన రాజకీయా లకు వ్యతిరేకంగా యువ జన కాంగ్రెస్, ఎం ఎస్ యు ఐ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు.ఈ కార్య క్రమంలో యువజన కాంగ్రె స్ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు,ఎం ఎస్ యు ఐ నాయకులు, యువజన కాంగ్రెస్ కార్యక ర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:5.రోగులకు పండ్లు పంపిణీ చేసిన యూత్ కాంగ్రెస్ నాయకు లు
____________________

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు