- District News
- ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన పిలుపు
ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన పిలుపు
జే ఏ సి ఆందోళనకు మద్దతు
నారాయణపేట ఆగస్టు 27:
నారాయణపేటలో గురువారం ఉద్యోగ జే ఏ సి నిరసన కార్యక్రమానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ నారాయణపేట జిల్లా శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.ఉద్యోగులు చాలా కాలంగా ఎదుర్కొం టున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్క రించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ నారాయణపేట జిల్లా అధ్యక్షులు గవినోళ్ల శ్రీనివాస్ జి ఓ 25ను సవరించాలనీ,జి ఓ 190ను అమలు చేయాలన్నారు. ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలనీ కోరారు.న్యాయమైన హక్కులకు సంబంధిం చినవేనని, ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గవినోళ్ల శ్రీనివాస్ కోరారు
ఉద్యోగుల హక్కుల కోసం జరుగుతున్న ఈ పోరాటా నికి తెలంగాణ రక్షణ సేన పార్టీ అండగా నిలుస్తుందని ఉద్యోగుల ఉద్యమంలో కలిసి ముందుకు సాగుతా మని ఆయన స్పష్టం చేశారుఈ సమావేశం లో టి ఆర్ ఎస్ నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె బండనరసింహులుమరియు ఇతర నాయకులు నర్సాపురం చిన్నలాలప్ప విట్లపురం నరసప్ప ఉల్లి గుండం మహేష్ సోషల్ ఆక్టివిటీస్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:4.సమావేశంలో మాట్లాడుతున్న టి ఆర్ ఎస్ నాయకులు
_____________________
