- District News
- Khammam
- నవ శకం" సంస్థ ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో ఘనంగా, ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం....
నవ శకం" సంస్థ ఆధ్వర్యంలో బ్రాహ్మణపల్లిలో ఘనంగా, ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం....
ప్రారంభించిన బ్రాహ్మణపల్లి గ్రామ ఉప,సర్పంచ్ ఏలూరి రవికుమార్...
బోనకల్ ;లోకల్ గైడ్:
గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని బోనకల్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ ఉపసర్పంచ్ ఏలూరి రవికుమార్ పేర్కొన్నారు. శనివారం బ్రాహ్మణపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ''నవ శకం'' స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరం అత్యంత విజయవంతంగా ముగిసింది.విజయవాడకు చెందిన ప్రముఖ 'రావెళ్ల కంటి హాస్పిటల్' వైద్య బృందం సారధ్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి ఉపసర్పంచ్ ఏలూరి రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై, లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
*➖గ్రామీణులకే నాణ్యమైన వైద్యం - మేకల రమేష్...*
ఈ సందర్భంగా నవ శకం ఫౌండేషన్ వ్యవస్థాపకులు (ఫౌండర్) మేకల రమేష్ మాట్లాడుతూ... నిరుపేదలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలను చెంతకే తీసుకురావాలనే ఉన్నతమైన లక్ష్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.గ్రామంలోని పౌరులు, వృద్ధులు పెద్ద ఎత్తున తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.
శిబిరంలో రావెళ్ల కంటి హాస్పిటల్ నిపుణులైన వైద్య బృందం గ్రామస్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి తగిన సలహాలు, సూచనలు మరియు మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మాగి ముఖేష్, నవ శకం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
