- District News
- సదరం సర్టిఫికెట్స్ కోసం వికలాంగుల అవస్థలు
సదరం సర్టిఫికెట్స్ కోసం వికలాంగుల అవస్థలు
ఆసుపత్రి ముందు అధికారుల కోసం గంటల తరబడి పడిగాపులు.
లోకల్ గైడ్/తాండూర్:
సదరం సర్టిఫికెట్ల కోసం తాండూర్ జిల్లా హాస్పిటల్ లో వికలాంగులు గంటల తరబడి పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు, అవస్థలు ఎదుర్కొంటున్నారని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పల్లి మల్లయ్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తాండూరు జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో సదరం సర్టిఫికెట్ల కోసం రుద్రారం,కొడంగల్, కోకట్,యాలాల గ్రామాలకు సంబంధించిన వికలాంగులు క్యాంప్ సందర్బంగా సదరం సర్టిఫికెట్ల కోసం వచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులు సమయానికి లేక గంటల తరబడి పడిగాపులు కాసిన సర్టిఫికెట్ జారీ చేసే ఉద్యోగులు కానీ, సిబ్బంది గానీ ఎవరు పట్టించుకోకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వాహిస్తున్నారని అన్నారు.సంబంధిత అధికారుల పైన జిల్లా వైద్య అధికారి,జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అంతే కాకుండా, సదరం సర్టిఫికెట్ల జారీ సమాచారం కోసం దివ్యాంగులు ఫోన్ చేసినా సంబంధిత అధికారులు స్పందించకపోగా...నిర్లక్ష్యం చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇకముందు క్యాంపులకు సంబంధించిన పూర్తి వివరాలు సూచిక బోర్డుపై వేయాలని డిమాండ్ చేశారు.
