టిపిఈటిఎఫ్ నూతన జిల్లా అధ్యక్షుడిగా బొజ్జ జానీ ఏకగ్రీవ ఎన్నిక .

Published On
టిపిఈటిఎఫ్ నూతన జిల్లా అధ్యక్షుడిగా బొజ్జ జానీ ఏకగ్రీవ ఎన్నిక .

 

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . లోకల్ గైడ్.

టిపిఈటిఎఫ్  నల్గొండ జిల్లా నూతన కార్యవర్గాన్నీ  ఎన్నుకొనుటకు, నల్గొండలోని ఎల్పిటి మార్కెట్లో వారి కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలలో నల్గొండ జిల్లా నూతన అధ్యక్షులుగా బొజ్జ జానీని ఎకగ్రీవంగా ఎన్నుకోగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా వరాల స్వామి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష కార్యదర్శు కార్యవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నికలు యూనియన్ సీనియర్ నాయకులు వరికుప్పల హనుమంతు, గౌరవ అధ్యక్షులు గుండా నాగయ్య  సమక్షంలో నిర్వహించారు. తన కార్యవర్గంలో జనరల్ సెక్రటరీ వర్కల  కృష్ణ, ఉపాధ్యక్షులు సముద్రాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అప్రోచ్, సహాయ కార్యదర్శిగా వంగాల రమేష్, సంయుక్త కార్యదర్శి షేక్ నదీమ్, ప్రచార కార్యదర్శిగా పట్టి కోటి పరమేష్, మల్లికార్జున్, కోశాధికారులు ఎండి జాహీర్,పైర్ల వెంకన్న,ఆర్గనైజర్ ఖాజా సలిముద్దీన్. ముఖ్య సలహాదారులుగా ఎండి షబ్బీర్ ఎండి గౌస్, మిట్ట కృష్ణారెడ్డి, వడ్డే దేవేందర్ రెడ్డి కూకుడాల చెన్నారెడ్డి, బుర్రి రవీందర్, సయ్యద్, అఖిల్,ఉద్దీన్  ఉన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం యూనియన్ అభివృద్ధికి కృషి చేయాలని కార్మికుల సమస్యల పరిష్కారంలో ముందు నడవాలని కోరారు.

Tags:

About The Author

Latest News