- District News
- ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి, అర్హత మేరకు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు వి. విక్టర్, ఎన్.వై. గిరి, శిక్షణ కలెక్టర్ రవితేజ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా మొత్తం 52 ఫిర్యాదులు, అందాయి.
ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. దరఖాస్తుదారులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా విచారణ నిర్వహించి, నిర్ణీత సమయంలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, క్షేత్రస్థాయిలో పరిశీలన అవసరమైన అంశాలను స్వయంగా పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. పరిష్కరించిన దరఖాస్తుల వివరాలను సంబంధిత రికార్డుల్లో నమోదు చేసి, దరఖాస్తుదారులకు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
