- District News
- Khammam
- భూ రీ-సర్వేతో ప్రతి భూమికి డిజిటల్ మ్యాప్ తో కూడిన భూధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్
భూ రీ-సర్వేతో ప్రతి భూమికి డిజిటల్ మ్యాప్ తో కూడిన భూధార్ కార్డులు.. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్
రైతుల సమక్షంలో పారదర్శకంగా హద్దుల నిర్ధారణ అక్కడికక్కడే విస్తీర్ణం వివరాలు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు భద్రత
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ద్వారా రైతుల భూములపై ఉన్న వివాదాలు, విస్తీర్ణ వ్యత్యాసాలు, రికార్డులలోని లోపాలను ఎవరికి అన్యాయం జరగకుండా పారదర్శకంగా భూసమస్యలు పరిష్కారం కావలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు.
సత్తుపల్లి నియోజకవర్గం లో మంగళవారం జిల్లా కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని గ్రామాలలో ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంగారం గ్రామంలో పంట పొలాలలో గట్టు వెంబటి నడుచుకుంటూ వెళ్లి రైతుల సమక్షంలో నిర్వహిస్తున్న రీ సర్వే ను పరిశీలించారు. బేతుపల్లి, అనంతరం నారాయణపురం గ్రామాల్లో జరుగుతున్న భూ రీసర్వే ప్రక్రియ పరిశీలించి రైతులతో కలెక్టర్ నేరుగా ముచ్చటించి సర్వే పై వారి అభిప్రాయాలను తెలుసుకొని రైతుల సందేహలను నివృత్తి చేశారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* సత్తుపల్లి నియోజకవర్గంలో బేతుపల్లి రెవెన్యూ పరిధిలోని గంగారం, బేతుపల్లి నారాయణపురం, రామగోవిందపురం, యం.వి. పాలెం, రామనగర్, పాకాలగూడెం గ్రామాలలో సూమరు 12 వేల ఎకరాలకు భూ సర్వే కొనసాగుతుందని, 10టీమ్ లలో ఇప్పటి వరకు 4 వేల ఎకరాల రైతుల భూములను రీ సర్వే పూర్తి చేశామని కలెక్టర్ వివరించారు.
ప్రతి మనిషికి అధార్ లాగా అధునిక యాంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం తో చేసున్న భూ సర్వే ద్వారా ప్రతి రైతు భూమికి డిజిటల్ మ్యాప్ తో కూడిన భూధార్ కార్డు ఉంటుందని తెలిపారు.
గ్రామంలోని రైతులకు గతంలో కొంత మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం, అన్లైన్ ప్రక్రియలో పేర్లు నమోదు కాకపోవడం, రికార్డుల్లో ఉన్న విస్తీర్ణానికి భూమిపై ఉన్న విస్తీర్ణానికి తేడాలు ఉండడం వంటి అనేక సమస్యలు రైతులు ఎదుర్కుంటున్న వారికి, అలాగే ఉన్న భూ విస్తీర్ణము కొంతమందికి తక్కువగా నమోదు కాగా, మరికొందరికి ఎక్కువగా నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయని, రీ-సర్వే ద్వారా అలాంటి అన్ని లోపాలను రీ సర్వే ద్వారా సరిచేస్తామని అన్నారు.
గ్రామంలోనీ ప్రతి రైతుకు 48 గంటల ముందుగానే నోటీసులు జారీ చేసి, రైతుల సమక్షంలోనే వారి పొలాలను కొలుస్తామని కలెక్టర్ తెలిపారు. రైతులు స్వయంగా తమ భూమి హద్దులను చూపిస్తారని, పక్కనే ఉన్న రైతులను కూడా పిలిచి పంచనామా నిర్వహించి హద్దులను నిర్ధారిస్తామని వివరించారు. భూ సర్వే కు నోటీసు ఇచ్చిన రైతులు వారి కుటుంబంలో భూ హక్కదారులు, పట్టా పాస్ బుక్ లో భూమి ఉన్న వారు అందరూ తప్పకుండా స్వయంగా సర్వేకు వచ్చి పూర్తి వివరాలు తెలియజేసి, సహకరించాలని కలెక్టర్ కోరారు. సర్వే పూర్తయ్యాక ఎంత విస్తీర్ణం నమోదైందో రైతులకు అక్కడికక్కడే తెలియజేస్తామని చెప్పారు. రైతులకు సందేహం ఉన్న మరొక్కసారి, రైతులు విశ్వసించే వరకు పారదర్శకంగా భూ రీ సర్వే చేసి వారితో స్వయంగా ఉన్న భూమి విస్తీర్ణముకు సంతకం కూడా తీసుకుంటామని అన్నారు.
భూ రీ సర్వే మొత్తం ప్రక్రియ పూర్తిగా క్షేత్ర స్థాయిలో భూ హక్కుదారిని సమక్షంలో జరుగుతుందని, రైతుల హక్కులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. రైతులు అపోహలకు గురికాకుండా అధికారులు అందించే సమాచారాన్ని నమ్మకంతో భూ రీ-సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించాలని కోరారు.
సర్వే అనంతరం గ్రామాల్లో భూ వివరాలను ప్రకటించి, వివరాలను గ్రామ పంచాయతీ, తహసీల్దారు కార్యాలయాలలో నోటీస్ బోర్డులో ఉంచుతామని, ఏలాంటి అభ్యంతరాలు ఉన్న గడువు ఇస్తామని, అభ్యంతరాలు స్వీకరించి పరిష్కరించిన తర్వాత వివరాలను పూర్తిస్థాయిలో ఆన్‌లైన్‌లో నమోదు చేసి భూధార్ కార్డులు జారీ చేస్తామని పేర్కొన్నారు. రీ-సర్వే పూర్తయిన తర్వాత భవిష్యత్తులో భూ వివాదాలు గణనీయంగా తగ్గి రైతులకు శాశ్వత భద్రత కలుగుతుందని కలెక్టర్ దివాకర టీఎస్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట సత్తుపల్లి తహసీల్దారు సత్యనారాయణ, గ్రామ సర్పంచ్ లు, సంబంధిత అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు.
