భక్తిశ్రద్ధలతో కారేపల్లి క్రాస్‌రోడ్డులో బోనాల పండుగ

తలపై బోనాలతో మహిళల ఊరేగింపు.. డప్పు వాయిద్యాల నడుమ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

Published On
భక్తిశ్రద్ధలతో కారేపల్లి క్రాస్‌రోడ్డులో బోనాల పండుగ

 

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి(సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగస్టు 9 : సింగరేణి మండలంలోని విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కారేపల్లి క్రాస్‌రోడ్‌ (రామలింగాపురం)లో ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం బోనాల పండుగను గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కుటుంబ సమేతంగా సంప్రదాయబద్ధంగా బోనాలను తయారు చేసి గ్రామదేవతలకు నైవేద్యంగా సమర్పించారు.

మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేకంగా అలంకరించిన బోనాల కుండలను తలపై ఎత్తుకుని, డప్పు వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా ఎర్రమ్మ ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కారేపల్లి క్రాస్‌రోడ్‌ పరిసర ప్రాంతంలోని గ్రామదేవతలైన ముత్యాలమ్మ, ఎర్రమ్మ తదితర అమ్మవార్ల ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని తమ కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. బోనాల ఊరేగింపుతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళల భక్తిగీతాలు, డప్పు వాయిద్యాల మోతతో కారేపల్లి క్రాస్‌రోడ్‌ సందడిగా మారింది.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సూరపరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కొత్త నాగేశ్వరరావు, పుచ్చకాయల శ్రీనివాసరావు, మొగిలిచర్ల మల్లికార్జున్, అనంతారపు వెంకటాచారి, ఏపూరి లక్ష్మీనారాయణ, పగడాల నాగేశ్వరరావు, వెగ్గలం పుల్లాచారి, సూరపరెడ్డి ఇంద్రారెడ్డి, పురం గోవర్ధన్, రాకేష్, కంసాని నాగరాజు, కోలా ఉపేందర్, మల్లెంపాటి శ్రీనివాసరావు, బట్టు మోహన్, బట్టు శ్రీనుతో పాటు స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా గ్రామస్తులంతా ఐక్యంగా పాల్గొని సంప్రదాయాలను కొనసాగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...