కొమురం భీం స్ఫూర్తితో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

ఆదివాసీల ఆత్మగౌరవం, హక్కులకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

Published On
కొమురం భీం స్ఫూర్తితో ఆదివాసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

లోకల్ గైడ్, ఆమనగల్లు, ఆగస్టు 9:
ప్రపంచ ఆదివాసీ గిరిజన హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమనగల్లు పట్టణంలో ఆదివాసీ దినోత్సవంతో పాటు 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు.
ఆమనగల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరుడు కొమురం భీం విగ్రహానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ కోఆర్డినేటర్ కృష్ణ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు దేశానికి అమూల్యమైన సంపద అని అన్నారు. ప్రకృతిని పరిరక్షిస్తూ తరతరాలుగా తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్న ఆదివాసీ, గిరిజనుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఆదివాసీల ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని, వారి హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం కొమురం భీం చేసిన పోరాటం, త్యాగం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. ‘జల్, జంగల్, జమీన్’ కోసం కొమురం భీం సాగించిన ఉద్యమం నేటికీ ఆదివాసీ సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కొమురం భీం వంటి మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆదివాసీ సమాజ సంక్షేమం, అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం నిర్వహించిన 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని యువతకు పలు సూచనలు చేశారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, ప్రజా సమస్యల పరిష్కారంలో యువత చురుకైన పాత్ర పోషించాలని అన్నారు. ప్రజాసేవలో ముందుండడంతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు  శ్రీనివాస్‌గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు, డీసీసీ ఉపాధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్‌రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు వస్పుల మానయ్య, యువజన కాంగ్రెస్ తాలూకా కార్యదర్శి అలీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వస్పుల శ్రీశైలం, విజయ్ రాథోడ్, హరిలాల్ నాయక్, శ్రీనివాస్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు ఖాదర్, రాగ్య నాయక్, ఆనంద్ నాయక్, శీను నాయక్, సురేష్ నాయక్, మెకానిక్ బాబా, రమేష్ నాయక్, గోపాల్ నాయక్, రాఘవేందర్, ఎన్‌ఎస్‌యూఐ ఫరీద్, అండేకర్ రాజు, నాసర్, శివ, అంజత్, కరీం, షాబుద్దీన్, కుమార్ ధోని తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి: వరి సాగును నియంత్రించి ప్రత్యామ్నాయ రబీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి:
    లోకల్ గైడ్, వికారాబాద్ జిల్లా  వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వ్యవసాయ శాఖ ఏ డి ఏ ఎస్
సల్బత్తాపూర్‌లో తాగునీటి కష్టాలు.. బిందెలతో గ్రామస్తుల నిరసన.
గాజీపూర్ మహోత్సవానికి పైలెట్ రోహిత్ రెడ్డికి ఆహ్వానం
సేవా కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్‌లు
హనుమకొండ లో ప్రైవేట్ స్కూల్ టీచర్స్ నిరసన 
పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం భూభారతి సదస్సులు, సాదాబైనామా అర్జీలను వెంటనే పరిష్కరించాలి
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యాప్ విధానాన్ని వెంటనే ఎత్తివేయాలి ...