విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు.

పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని  రాజీవ్‌చౌక్‌లో నిరాహార దీక్ష.

ప్రైవేట్ కళాశాలల లెక్చరర్ల సంఘం మద్దతు. ----  బీజేపీ జిల్లా ఇన్‌చార్జ్ బొక్క బాల్‌రెడ్డి .
Published On
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దు.

వనపర్తి లోకల్ గైడ్ ప్రతినిధి ఆగస్ట్ 31 :
 
 రాష్ట్ర  ప్రభుత్వం  విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దని వెంటనే  పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని వనపర్తి జిల్లా  బీజేపీ ఇంచార్జీ బొక్క బాల్ రెడ్డి డిమాండ్  చేశారు. సోమవారం  పెండింగ్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలని  బీజేపీ,బీజేవై ఎం  ఆధ్వర్యంలో రాజీవ్‌చౌక్‌లో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. బకాయిలు విడుదల చేయకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు. 
ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాలేజీల్లో విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోవడం వల్ల ఉన్నత విద్యను కొనసాగించేందుకు, ఉద్యోగ అవకాశాలను పొందేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులపై ఆర్థిక భారం మరింత పెరుగుతోందన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి భారీ ఉద్యమాలు చేపడతామని, అవసరమైతే తెలంగాణ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని బొక్క  ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలనే డిమాండ్‌తో బీజేపీ నిర్వహిస్తున్న పోరాటానికి ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలల లెక్చరర్స్ అసోసియేషన్ నాయకులు  వినోద్ కుమార్, రమేష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, మల్లికార్జున్, అమరేందర్, రాజేష్, సైదులు, రవి, విజయకుమార్ తదితరులు దీక్షకు మద్దతు ప్రకటించారు. అదే విదంగా వివిధ ప్రజా సంఘాలు,  రాజకీయాలకు అతీతంగా దీక్ష మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో    బీజేపీ వనపర్తి జిల్లా అధ్యక్షులు డి. నారాయణ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు అరవింద్ , నాయకులు సబిరెడ్డి వెంకటరెడ్డి, మున్నూరు రవీందర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీశైలం, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు అనుజ్ఞా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యదర్శి కృష్ణ గౌడ్, జిల్లా మీడియా కన్వీనర్ గజరాజుల తిరుమలేష్
  తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్ సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో ‘ఫ్రీ’ యూనిఫాం, షూస్
        కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్ : మండలంలోని సూర్యతండా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠశాల యూనిఫాంలు,
భూలోక్ రెడ్డి,భూక్య సతీష్ కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సమ్మిగౌడ్..
"కోట్ల మణిపూసలు"
మసీదులు.. కబురస్థాన్లకు నిధుల పోరాటం!
ప్రజల ఆకాంక్ష.. రాందాస్ నాయక్‌కు మంత్రి పదవి ఇవ్వాలి
"శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాల సమన్వయం - శాంతి భద్రతల పరిరక్షణ
సూధనపల్లి పాఠశాలలో ఉచిత యూనిఫామ్ పంపిణీ ...