- District News
- కాంగ్రెస్ పార్టీతోనే పేదల సొంతింటి కల సాకారం.
కాంగ్రెస్ పార్టీతోనే పేదల సొంతింటి కల సాకారం.
- త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత ప్రారంభం.
లోకల్ గైడ్/తాండూర్:
పేదల సొంతింటి కలను సాకారం చేయడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.
సోమవారం పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి గ్రామంలో కోస్గీ సుశీల–లక్ష్మప్ప (బాబు) దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంతింటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేసి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
పేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, సర్ కన్వీనర్ కరణం పురుషోత్తం రావు, మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి, కందనెల్లి గ్రామ సర్పంచ్ భూమే యాదమ్మ, మాజీ మండల అధ్యక్షులు గోపాల్, పార్టీ నాయకులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, రామచంద్ర, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
