ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ ముగింపు  సభలను జయప్రదం చేయండి.

ప్రభుత్వ యూనివర్సిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.

యూనివర్సిటీలలో టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్‌చార్జ్ రెహమాన్
Published On
ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ ముగింపు  సభలను జయప్రదం చేయండి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు
(లోకల్ గైడ్ న్యూస్)

హనుమకొండ,సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న అఖిల భారత విద్యార్థి సమాఖ్య 90వ వార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్‌చార్జ్ రెహమాన్ పిలుపునిచ్చారు.
కాకతీయ యూనివర్సిటీ గెస్ట్‌హౌస్‌లో యూనివర్సిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు పోరాట మార్గాన్ని ఎంచుకున్నారని తెలిపారు. గత పదేళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 90 వేల పాఠశాలలు మూతపడ్డాయని పేర్కొన్నారు.
తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం ద్వారా విద్యను మరింత కార్పొరేటీకరణ వైపు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. యూనివర్సిటీలలో సుమారు 70 శాతం టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడుతోందని అన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను దూరం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
*విద్యారంగ పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి*
హనుమకొండ జిల్లా కార్యదర్శి భాష బోయిన సంతోష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో హనుమకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఏఐఎస్ఎఫ్ 90వ వసంతాల వార్షికోత్సవ ముగింపు సభలను జయప్రదం చేయాలని విద్యార్థులు, మేధావులు, విద్యావేత్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
పల్లె నుంచి పట్టణం వరకు గంజాయి వంటి మత్తు పదార్థాల విస్తరణ ఆందోళనకరంగా మారిందని అన్నారు. మత్తు పదార్థాల ప్రభావంతో హత్యలు, దోపిడీలు, మహిళలపై దాడులు వంటి నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని విద్యాసంస్థల్లో కూడా మత్తు పదార్థాల ప్రభావం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఇటీవల నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో చోటుచేసుకున్న ప్రిన్సిపాల్ రూపా రెడ్డి హత్య ఘటనను ప్రస్తావిస్తూ, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు. భవిష్యత్తులో విద్యాసంస్థల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.వర్షాకాలంలో శిథిలావస్థకు చేరిన సంక్షేమ హాస్టళ్ల భవనాలు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నందున వాటిని వెంటనే పరిశీలించి, అవసరమైన చోట పాత భవనాలను తొలగించి నూతన భవనాలు నిర్మించాలని కోరారు. విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ మెస్, కాస్మోటిక్ చార్జీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, టీచర్, డీఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, విద్యార్థుల తల్లిదండ్రులపై అధిక ఫీజుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
*భవిష్యత్ విద్యార్థి ఉద్యమాల  కార్యచరణకు  హనుమకొండ వేదిక*
విద్యారంగ సమస్యలు, ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ, విద్యార్థుల హక్కులు, సామాజిక సమస్యలపై క్షేత్రస్థాయిలో సమగ్ర చర్చ జరిగి, భవిష్యత్ విద్యార్థి ఉద్యమాలకు కార్యాచరణ రూపొందించేందుకు హనుమకొండ వేదిక కానుందని సంతోష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఊట్కూరి ప్రణీత్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీపతి వినయ్, వేల్పుల చరణ్, కేయూ ఉపాధ్యక్షులు వంశీ, యాస్మిన్ సహాయ కార్యదర్శి అబ్బరబోయిన నాగరాజు, అనూష, జిల్లా సమితి సభ్యులు కందకట్ల అజయ్, రామ్ చరణ్ పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్‌కు క్షమాపణ చెప్పాలి.
తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ తాతా మధు దూషించడం సరికాదని ఫరూక్‌నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయికల్...
దళితులంటే బిఆర్ఎస్ పార్టీకి అంత చిన్న చూపా*? దళితుల జోలికి వస్తే ఖబడ్దార్ : ,
మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్టించాలి.
పోలీస్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సట్టు సైదులు.
జనగణన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలి 
గణేష్ ఉత్సవాల్లో డిజే లకు అనుమతి లేదు.        
ఫిరంగినాలపై అక్రమ నిర్మా ణాలు.......