- District News
- సూధనపల్లి పాఠశాలలో మట్టి వినాయకుల ఎకో ఫ్రెండ్లీగణపతి తయారీ ..
సూధనపల్లి పాఠశాలలో మట్టి వినాయకుల ఎకో ఫ్రెండ్లీగణపతి తయారీ ..
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూధనపల్లి గ్రామంలో
- ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు - మట్టి వినాయకులే ముద్దు... అని పిలుపు
- ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు చిన్నం ప్రదీప్ కుమార్
-
కురవి మండలం లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల సూధనపల్లి లో విద్యార్థులందరూ మట్టి వినాయకులను( ఎకో ఫ్రెండ్లీ గణపతి) తయారు చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు మరియు స్కూల్ అసిస్టెంట్ తెలుగు అయిన చిన్నం ప్రదీప్ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించాలి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన వినాయకుల వాళ్ళ నీటి కాలుష్యం పెరుగుతుందని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎండి .అంజద్ పాషా, గాండ్ల బాలరాజు, బి. సరోజ, వి.శుభ, కె. సారంగం, ఏ .ప్రగతి,ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ రేఖ మాధవి, ఆయా నీలం వాసవి,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎలమశెట్టి ధనమ్మ , అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
