బేడ బుడగ జంగాల సంఘ రాష్ట్ర అధ్యక్షునికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి.

Published On
బేడ బుడగ జంగాల సంఘ రాష్ట్ర అధ్యక్షునికి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి.

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు10
(లోకల్ గైడ్ న్యూస్)*:

హనుమకొండ,తెలంగాణ రాష్ట్రంలో బేడ బుడగ జంగం సమాజ అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న  బుడగ జంగం జనసంఘం రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణుకి తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పదవిని కల్పించాలని వరంగల్ జిల్లా అధ్యక్షుడు సిరిగిరి జంపయ్య కోరారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జంపయ్య మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బేడ బుడగ జంగం సమాజం తరఫున గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, పార్టీ విజయానికి తమ వంతు కృషి చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2024లో ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు సానుకూల తీర్పు వెలువడిన అనంతరం, తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వెంటనే, రాష్ట్ర అధ్యక్షులు సిరిపాటి వేణు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 26 జిల్లాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించి, బేడ బుడగ జంగం సమాజాన్ని మాల, మాదిగలతో కలపకుండా ప్రత్యేక ఉపవర్గంగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాన్ని ముందుకు నడిపారని,అంతేకాకుండా, రాష్ట్ర మంత్రులను పలుమార్లు కలిసి వినతిపత్రాలు సమర్పించి, బేడ బుడగ జంగం సమాజానికి ప్రత్యేక గుర్తింపు కల్పించాలని విజ్ఞప్తి చేశారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో భాగంగా బేడ బుడగ జంగాలను ప్రత్యేకంగా గుర్తించి కుల ధ్రువీకరణ పత్రాలు కేటాయించడంలో కృషి కృషి చేశారని,గతంలో ఉన్న నాయకత్వంతో పోల్చితే సమాజాన్ని సంఘటితం చేయడం, హక్కుల సాధన కోసం పోరాడడం, ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడం వంటి అంశాల్లో సిరిపాటి వేణు నాయకత్వం విశేషంగా నిలిచిందని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి వరంగల్  జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మాల, మాదిగల తరువాత జనాభా పరంగా మూడవ అతిపెద్ద ఎస్సీ వర్గంగా ఉన్న బేడ బుడగ జంగం సమాజానికి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా తగిన రాజకీయ గుర్తింపు గాని, ఉన్నత పదవులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం కోసం తీసుకుంటున్న చర్యలను జిల్లా కమిటీ హృదయపూర్వకంగా అభినందిస్తోందని,ఈ నేపథ్యంలో సమాజ సేవ, ఉద్యమ నిబద్ధత, నాయకత్వ సామర్థ్యం, ప్రభుత్వంతో సమర్థవంతమైన సమన్వయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వేణుకి ఎస్సీ కార్పొరేషన్ పదవి కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బేడ బుడగ జంగాల నాయకులు కత్తి మల్లయ్య,సోమయ్య,రాజు,జగన్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News