- District News
- Khammam
- బోళ్ల గంగారావు కుమార్తె వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్
బోళ్ల గంగారావు కుమార్తె వివాహానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్
Published On
By Ram Reddy
ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 26 ( లోకల్ గైడ్ ) :
వైరా మిట్టపల్లి ఫంక్షన్ హాల్‌లో మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ల గంగారావు కుమార్తె మౌనిక వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరులకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మ రోశయ్య, వీరబాబు, కారేపల్లి మండల నాయకులు అజ్మీర వీరన్న, భూక్య రాంకిషోర్, ఏన్కూర్ మండల నాయకులు బానోత్ సురేష్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Tags:
About The Author
Related Posts
Latest News
08 Sep 2026 17:05:04
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 8, లోకల్ గైడ్ న్యూస్ :
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై హైదరాబాద్‌లో చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను తెలంగాణ
