ఖానాపూర్‌లోనే చేయూత పింఛన్లు..

పెద్దపులి కిషన్ చొరవతో సమస్యకు పరిష్కారం

Published On
ఖానాపూర్‌లోనే చేయూత పింఛన్లు..

 

గండిపేట , ఆగస్టు 25 లోకల్ గైడ్ :

నార్సింగి సర్కిల్  గండిపేట డివిజన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కంటి చూపు లేని పింఛన్‌దారులు గత మూడు, నాలుగు నెలలుగా ఎదుర్కొంటున్న ఇబ్బందులకు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్దపులి కిషన్ చొరవతో పరిష్కారం లభించిందని గ్రామస్తులు చెబుతున్నారు. సోమవారం  ఖానాపూర్ గ్రామంలోనే చేయూత పింఛన్లు అందించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఇప్పటివరకు పింఛన్‌దారులు సుమారు 3–4 కిలోమీటర్లు దూరంలోని గండిపేట్‌కు ఆటోల్లో వెళ్లి పింఛన్లు తీసుకోవాల్సి వచ్చేది. దీంతో వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఆటో చార్జీల రూపంలో పింఛన్‌లో కొంత మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వచ్చేది అని ఆయనకు తెలియజేశారు.
ఈ సమస్యను ఖానాపూర్ గ్రామస్తులు బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు పెద్దపులి కిషన్ అలియాస్ కృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత పోస్టల్ అధికారులను కలిసి వరుసగా వినతిపత్రాలు అందజేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేశారు. ఎస్‌పీఎం గండిపేట్ నుంచి చీఫ్ పోస్టుమాస్టర్ కార్యాలయం, అడ్మినిస్ట్రేషన్ అధికారులు, ఉస్మానియా యూనివర్సిటీ పోస్టాఫీసు అధికారులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించే వరకు  కృషీ చేశారు.

ఈ క్రమంలో అధికారులు ఖానాపూర్‌లో పింఛన్లు పంపిణీ చేయాల్సిన అవసరాన్ని గుర్తించి, మంగళవారం గ్రామంలోనే పింఛన్‌దారులకు చేయూత పింఛన్లు అందించారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నా వంతు బాధ్యతగా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పత్రికా మిత్రులు కూడా వార్తలను ప్రచురించి సహకరించారని పెద్దపులి కిషన్ తెలిపారు. సమస్య పరిష్కారానికి సహకరించిన పోస్టల్ అధికారులు, పాత్రికేయ మిత్రులు, గ్రామ పెద్దలు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులకు పింఛన్‌దారుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు 

పింఛన్ దరఖాస్తులకు అవకాశం....

ఇంకా పింఛన్లు అందని అర్హుల కోసం ఈ నెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నందున, అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పెద్దపులి కిషన్ సూచించారు. దరఖాస్తు ప్రక్రియపై అవగాహన లేని వారికి బీఆర్‌ఎస్‌ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్‌ఎస్ నాయకులు తలారి మై కృష్ణ, రామేశ్వరం దేవదాసు, గొల్ల తుకారం, తప్పు రవీందర్, ఎర్రోళ్ల ప్రకాష్, డప్పు రాకేష్, పసుల బాలరాజ్, మహమూద్ పాషా, మస్కూరి అర్జున్, కొండకర్ల అరుణ్, దాకురి వంశీ, మిర్చిగూడెం వెంకటయ్య, శంకరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్  స్పీకర్‌పై నోరు పారేసుకుంటే.. చట్టం ఊరుకోదు!...అజ్మీర నరేష్ కుమార్ డిమాండ్ 
    కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 8, లోకల్ గైడ్ న్యూస్ : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై హైదరాబాద్‌లో చేసిన అనుచిత, అవమానకర వ్యాఖ్యలను తెలంగాణ
రైతు వేదికలో సన్న రకాల వరి సాగు నమోదు పత్రాల స్వీకరణ
రాష్టాన్ని  సంక్షోభం లోకి నెట్టిన అసమర్థ కాంగ్రేస్   ప్రభుత్వం .
మట్టి వినాయకుడినే పూజిద్దాం.. ప్రకృతిని కాపాడుదాం!”
దళిత వ్యతిరేకి బీ ఆర్ ఎస్ పార్టీ...అధికారం కోల్పోయామనే అక్కసుతో దళితుల పట్ల సంస్కార హీనంగా ప్రవర్తించిన బిఆర్ఎస్ ఎంఎల్సీ తాత మధు.
7వ వార్డులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ
సీతక్క చొరవతో లక్నవరం నీళ్లు.. రైతుల పాలాభిషేకం