సాంకేతిక పరిజ్ఞానంతో భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

Published On
సాంకేతిక పరిజ్ఞానంతో భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్

 

అశ్వాపురం : జిల్లా బ్యూరో (లోకల్ గైడ్ న్యూస్):

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి భూ సరిహద్దులను కచ్చితంగా నిర్ధారిస్తూ భూ రీ సర్వే పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోవర్, ట్యాబ్ పరికరాలతో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే ప్రక్రియను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ విధానంలో సర్వే నిర్వహించడం వల్ల సమయం, సిబ్బంది ఆదా కావడంతో పాటు ట్యాబ్‌లో నమోదైన సమాచారాన్ని నేరుగా కంప్యూటర్, ఆటోక్యాడ్‌లోకి మార్చుకునే అవకాశం ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అమ్మగారిపల్లి, కుమ్మగూడెం పరిధిలో కాడస్ట్రల్ మ్యాపులు, పాత రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమారు 1,900 ఎకరాలకు పైగా భూముల సరిహద్దులను నిర్ధారిస్తున్నట్లు తెలిపారు. 1920ల నాటి ఫసలీ రికార్డులతో పాటు బూర్గంపాడు తాలూకాకు సంబంధించిన పాత రికార్డులను పరిశీలిస్తున్నట్లు అధికారులు వివరించారు. మూడు తరాలుగా భూములను అనుభవిస్తున్నప్పటికీ రికార్డుల్లో ఉపవిభజనలు నమోదు కాకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. గోదావరి వరదలు, భూమి కోతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాత భూ సరిహద్దులు మారిపోయాయని అధికారులు తెలిపారు. సీతారామ ప్రాజెక్టు పరిసరాల్లో కొన్ని చోట్ల సుమారు 250 మీటర్ల మేర భూ సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు వివరించారు. 57/1 తదితర సర్వే నంబర్లలో నీట మునక, ఇసుక మేటల కారణంగా పాత భూ గుర్తులు కనుమరుగైనట్లు తెలిపారు. కేఎంఎల్ ఫైళ్ల ఆధారంగా సుమారు 7.91 కిలోమీటర్ల మేర సరిహద్దులను గుర్తిస్తున్నామని, రోజుకు సుమారు 2 కిలోమీటర్ల చొప్పున సర్వే నిర్వహించి 2 నుంచి 4 రోజుల్లో పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. పాత రికార్డులను సమగ్రంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు భూములపై స్పష్టత కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ ప్రాంతంలో రహదారి నిర్మించాలని కలెక్టర్‌ను కోరగా, అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ సీఎస్‌ఆర్ నిధులతో అవసరమైన మేరకు రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అశ్వాపురం తహసీల్దార్ సూర్యప్రకాష్, సర్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి