ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై ఆరా

సర్పంచ్ హేమలత బాలాజీ పాఠశాల సందర్శన

Published On
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలపై ఆరా

 

 

పొలం పల్లి, సెప్టెంబర్ 11, లోకల్ గైడ్ న్యూస్:

పొలం పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను ఖమ్మం జిల్లా దిశ కమిటీ సభ్యురాలు, గ్రామ సర్పంచ్  హేమలత బాలాజీ సందర్శించి పాఠశాలలోని పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదులను పరిశీలించిన ఆమె విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధనా విధానం తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు, పాఠశాలలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. అదేవిధంగా తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, పారిశుధ్యం, పాఠశాల పరిసరాల పరిశుభ్రత, విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను పరిశీలించారు. పాఠశాలలో గుర్తించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హేమలత బాలాజీ తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సురక్షితమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు గ్రామ పంచాయతీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి