సోమనాథ క్షేత్రంలో శాంతి సమత్వ దినోత్సవ వేడుకలు

Published On
సోమనాథ క్షేత్రంలో శాంతి సమత్వ దినోత్సవ వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి: చౌటుప్పల్ (లోకల్ గైడ్): సెప్టెంబర్ 11

 శ్రీ సోమనాథ క్షేత్రంలో శాంతి సమత్వ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శాంతి యుగస్థాపకులు శ్రీ సోమనాథ మహర్షి ఆదేశానుసారం ఈ ఉత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చౌటుప్పల్ పురపాలిక చైర్ పర్సన్ మొగుదాల  పావని రమేష్ గౌడ్ చేతులమీదుగా శివలింగానికి క్షీరాభిషేకం, జలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు.IMG-20260911-WA0108 మహర్షి చిత్రపటంతో ఆయన భక్తులు నిర్వహించిన నగర సంకీర్తనలు పురపాలక చైర్ పర్సన్ మొగుదాల పావని, రమేష్ గౌడ్లు  పాల్గొన్నారు. మహర్షులవారికి అఖండ దీపారాధన చేశారు. క్షేత్ర కమిటీ అధ్యక్షుడు బడుగు నరసింహ చేతుల మీదుగా ప్రణవ, శాంతి పతాకాలను ఆవిష్కరించారు. సామూహిక ధ్యానం చేశారు. వేదమూర్తులచే మృత్యుంజయ యాగం, అక్షర లక్ష్య యాగం శాస్త్రవేత్తంగా జరిపారు. శ్రీ సోమనాథ మహర్షి  భక్తులు శిష్యులు సామూహికంగా శతక పారాయణం చేశారు. ఈ ఉత్సవాల్లో శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షుడు బడుగు జయప్రకాష్, క్షేత్ర కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పిడి రాంరెడ్డి, ఉపాధ్యక్షుడు మండలోజు సుభాష్ చారి, కార్యదర్శి గట్టు ప్రభాకర్, ఉప కార్యదర్శి చిరువెల్ల రవీందర్, కోశాధికారి ఊరా కృష్ణమూర్తి, మహర్షి శిష్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి.
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.  జిల్లాలో నేర నియంత్రణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, ఎన్ బి డబ్ల్యు పెండింగ్ కేసుల పరిష్కారం, ఆస్తి
గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లో ఘనంగా వినాయక చవితి ముందస్తు వేడుకలు
26వ రోజుకు చేరిన పాలిటెక్నిక్ విద్య పరిరక్షణ ఉద్యమం
ఖరీఫ్ ధాన్యం సేకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి – అదనపు కలెక్టర్ (రెవెన్యూ) చంద్రా రెడ్డి
లోకపల్లిలో జనజాతర
పేదలపై నిర్లక్ష్యం.. హామీలు బేఖాతర్!
రోడ్డు మరమ్మత్తుల పనులను చేపట్టండి