- District News
- భద్రాచలం గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వండి
భద్రాచలం గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం గుర్తించిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వండి
Published On
By Ram Reddy
భద్రాచలం గోదావరి నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం భద్రాచలం వైకుంఠధామం సమీపంలోని ఒడ్డుకు చేరింది. మృతుడి వివరాలు వయస్సు సుమారు 50–60 సంవత్సరాలు, చర్మం ఎరుపు రంగు, తల చిన్న బట్టతల, తెల్లని జుట్టు, ఎత్తు సుమారు 5 అడుగులు, దుస్తులు సిమెంట్ రంగు షర్టు, ఆకుపచ్చ (గ్రీన్) రంగు షార్ట్ ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తించినట్లయితే వెంటనే భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించి సమాచారం అందించగలరు. గోదావరి ఎగువ ప్రాంతాలైన ఎటపాక, చెన్నంపేట, చింతలగూడెం, కన్నాయిగూడెం, తూర్పాక, నరసాపురం, గంగోలు, దుమ్ముగూడెం, పర్ణశాల తదితర గ్రామాల ప్రజలు ఈ ఫోటోను పరిశీలించి, మృతుడిని గుర్తించే అవకాశం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి. ఈ గుర్తుతెలియని వ్యక్తి ఫోటోను సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు మరియు ఇతర మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ చేసి, మృతుడి వివరాలు గుర్తించేందుకు పోలీసులకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. సంప్రదించవలసిన నంబర్లు : ఎస్ హెచ్ వో, భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్ 8712682105, 8712682160
Tags:
About The Author
Related Posts
Latest News
07 Aug 2026 19:39:23
ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్.
- శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పూజారి పాండు.
