యాదవుల మధ్య ఐకమత్యం లేదనే భావనను తీసివేసి మేమంతా ఒకటే అనే భావన ను ఆచరణలో నిరూపించాలి

Published On
యాదవుల మధ్య ఐకమత్యం లేదనే భావనను తీసివేసి మేమంతా ఒకటే అనే భావన ను ఆచరణలో నిరూపించాలి

 లోకల్ గైడ్ ఆగస్టు 25 మహబూబాబాద్ 

మహబూబాబాద్ జిల్లా తెలంగాణ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సూత్రపు రాజు యాదవ్ మాట్లాడుతూ 
యాదవులు 
అన్ని శాఖలు  కలిసి ఒకే భావంతో యాదవ్ గా కొనసాగాలి.
యాదవులు వివిధ శాఖలుగా విడిపోవడం వలన బలహీన పడతారు. 
యాదవులు పార్టీ విభేదాలు వదలి కలిసిమెలిసి సోదర భావంతో జీవించాలి. 
యాదవులు సమిష్టి నిర్ణయం, సమిష్టి ఆలోచన, సమిష్టి ప్రయోజనం దిశగా అడుగులు వేయాలి. 
యాదవుల మధ్య ఐకమత్యం లేదనే భావనను తీసివేసి మేమంతా ఒకటే అనే భావన ను ఆచరణలో నిరూపించాలి. 
రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సంఘాలన్నీ కలిసి ఒకే వేదికగా యాదవ జాతి ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితి కొరకు రాజీలేని పోరాటం చేయాలి. 
యాదవులు వివిధ రాజకీయ పార్టీల విభేదాల కారణంగా గొడవలు పడి నష్టపోతున్నారు. 
యాదవులు వివిధ సంఘాలుగా విడిపోయి ఐకమత్యంగా లేకపోవడం వలన నష్టపోతున్నారు. 
యాదవులు వ్యక్తిగత ఎజెండాల కోసం కాకుండా, యాదవ జాతి ఎజెండా కోసం పని చేస్తే యాదవ జాతి కోల్పోయిన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. 
కావున యాదవ జాతి ముందున్న ఏకైక లక్ష్యం ఒక్కటే
అందరం కలిసి మెలిసి ఉండి ఐకమత్యంతో అధికారాన్ని పొందడం. 
యాదవులు శాకలకతీతంగా పార్టీలకతీతంగా 
గ్రూపుల కతీతంగా
ఐకమత్యంతో అవగాహనతో
అన్ని రంగాలలో నూటికి నూరు శాతం అభివృద్ధి చెందాలి. 
యాదవులు విద్యా, ఉద్యోగ, ఉపాధి, సామాజిక, సాంస్కృతిక, పారిశ్రామిక, రాజకీయ, వైద్య, వ్యాపార, సినీ, మీడియా, ఆధ్యాత్మిక, సేవా రంగాలలో అభివృద్ధి చెందాలి. 
యాదవుడా మేలుకో! 
 నీ రాజ్యం నీవే ఏలుకో. 
జనం మనది బలం మనది ఏకమైతే రాజ్యాధికారం మనదే. 
పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప. 
అడుక్కుంటే అధికారం రాదు, హక్కుగా పోరాడి సాధించుకుందాం రండి. 
ఎక్కే సింహాసనం మొక్కితే రాదు గుద్ది గుంజుకుందాం రండి. 
అన్ని సమస్యలకు పరిష్కారం రాజ్యాధికారమే, 
రాజ్యాధికారాన్ని పోరాడి సాధించుకుందాం రండి. 
రాజ్యం వీర భోజ్యం
 వీరుని వరిస్తుంది. 
యాదవ సోదరీ, సోదరులు
యాదవ జాతి హక్కుల కోసం, అభివృద్ధి కోసం, అధికారం కోసం పులులు, సింహాలై గర్జించాలి. 
యాదవ విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కవులు ,కళాకారులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, మహిళలు, సమస్త యాదవ జాతి ఉద్యమ బాట పట్టాలి తెలంగాణ యాదవ మహాసభ  సూత్రపు రాజు యాదవ్ 
జిల్లా అధ్యక్షుడు  ఆయన తెలిపారు

Tags:

About The Author

Latest News

ఓటర్ల ప్రత్యేక సమగ్ర వేగవంతంచేయాలి  ఓటర్ల ప్రత్యేక సమగ్ర వేగవంతంచేయాలి 
    లోకల్ గైడ్, వికారాబాద్ : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ విచారణ ప్రక్రియను వేగవంతం  చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటాచారి తెలిపారు.సోమవారం
కేటీఆర్, హరీశ్‌రావు అరెస్టులతో భగ్గుమన్న అశ్వారావుపేట
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి: ఏ. శ్రీ దేవసేన
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి.
ఇది ప్రజాస్వామ్యమా రాక్షస రాజ్యమా?
ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో ఐపీఎస్‌ విద్యార్థుల ప్రతిభ
జర్నలిస్టులపై కలెక్టర్ నిర్లక్ష్యం తగదు ఫీజు రాయితీ జీవో వెంటనే విడుదల చేయాలి