బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాలి.

Published On
బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాలి.

లోకల్ గైడ్/బంట్వారం:

మండలంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకుని, గ్రామాల్లో మద్యం విక్రయాలను నియంత్రించాలని భారత ఏకలింగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పబ్లిక్ న్యూస్ జిల్లా రిపోర్టర్ కావలి నర్సిములు బంట్వారం ఎస్‌ఐ విమలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని పలు కిరాణా దుకాణాల్లో ఉదయం వేళల నుంచే అర్ధరాత్రి వరకు అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. మద్యానికి బానిసవుతున్న యువత కుటుంబ కలహాలకు, గ్రామాల్లో గొడవలకు పాల్పడుతున్నారని తెలిపారు. తాగిన మైకంలో క్షణికావేశానికి లోనై ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సల్బత్తాపూర్  గ్రామంలో గత నెల రోజులుగా తరచూ గొడవలు జరుగుతున్నాయని, గ్రామంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి బెల్ట్‌షాపుల నిర్వహణను అరికట్టాలని కోరారు. అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీలు నిర్వహించి, గ్రామాల్లో మద్యపానాన్ని నియంత్రించేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని నర్సిములు విజ్ఞప్తి చేశారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...