- District News
- Khammam
- స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాత మధుపై కాంగ్రెస్ భగ్గుమంది!
స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాత మధుపై కాంగ్రెస్ భగ్గుమంది!
ఎంఎల్సీ తాత మధు సభ్యత్వాన్ని రద్దు చేయాలి: కారేపల్లి మండల అధ్యక్షుడు తోటకూరి రాంబాబు
కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 7, లోకల్ గైడ్ న్యూస్ : అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎంఎల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కారేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూరి రాంబాబు ఆధ్వర్యంలో
సోమవారం బస్టాండ్ సెంటర్‌లో పెద్ద ఎత్తున నిరసన చేపట్టి తాత మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ పదవుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందని అన్నారు. అనంతరం కారేపల్లి పోలీస్ స్టేషన్‌లో తాత మధు వ్యాఖ్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంఎల్సీ తాత మధుపై తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
