చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి

తాండూర్ లో ఘనంగా శాఖాంబరి ఉత్సవాలు. - ప్రత్యేక అలంకరణలో అమ్మవారి దర్శనం

ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్.  - శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన పూజారి పాండు.
Published On
చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి

లోకల్ గైడ్ తాండూరు:
ప్రజలందరినీ చల్లంగా చూడు ఎల్లమ్మ తల్లి అంటూ బిజెపి జిల్లా అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.ఆషాఢ మాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని వాల్మీకి నగర్ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శాకాంబరీ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.
ఉత్సవాల సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. శాకాంబరీ అలంకరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా బిజెపి సీనియర్ నాయకులు పూజారి పాండు ఆహ్వానం మేరకు, బీజేపీ జిల్లా అధ్యక్షులు యు. రమేష్ కుమార్ ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి పాండు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే కంజర్ల విజయలక్ష్మి యాదవ్ కూడా ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. మాజీ కౌన్సిలర్ అంతారం లలిత ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఆషాఢ మాసం చివరి శుక్రవారం సందర్భంగా ఆలయానికి వచ్చిన మహిళలు ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుని ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు యు. రమేష్ కుమార్ మాట్లాడుతూ..ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు పాడిపంటలు బాగా పండాలని, రైతులు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ అమ్మవారి దీవెనలతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరాజ్ కృష్ణ, కౌన్సిలర్లు కిరణ్ ముదిరాజ్, నాగారం మల్లేశం, కార్యదర్శి బంటారం భద్రేశ్వర్, గొల్ల మల్లేశం, సిద్ధిరి ప్రకాష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News