మాస్టర్ జీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ ,జయంతి వేడుకలు

ఓబీసీ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్...వెల్లడి

Published On
మాస్టర్ జీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ ,జయంతి వేడుకలు

హనుమకొండ జిల్లా ప్రతినిధి,ఆగస్టు06
(లోకల్ గైడ్ న్యూస్):

తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుదామని ఓబీసీ నేతలు పిలుపు,ఈ సందర్భంగా
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు,
హనుమకొండ,
తెలంగాణ సిద్ధాంతకర్త, తొలి మలిదశ ఉద్యమకారుడు, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ పుట్టినరోజు సందర్భంగా ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్(ఓబీసీ ) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హంటర్ రోడ్ లోని మాస్టర్ జీ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు...జన్మదినాన్ని పురస్కరించుకొని కళాశాలలో విద్యార్థిని, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు  నిర్వహించారు..ఈ కార్యక్రమానికి కూడా మాజీ చైర్మన్,ఓబిసి చైర్మన్ ఎస్ . సుందర్ రాజ్ యాదవ్  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు......సుందర్ రాజ్ యాదవ్  మాట్లాడుతూ.... తెలంగాణ ఉద్యమానికి ఒక దశ-దిశ దిక్సూచి సిద్ధాంతకర్త తన జీవితాన్ని ధారబోసి లక్షలాదిమంది ఉద్యమకారులను తయారు చేశారని గుర్తుచేశారు.. ప్రొఫెసర్ జయశంకర్  నీళ్ళు ,నిధులు, నియమాకం పైన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల పట్ల విద్యార్థుల పట్ల రైతాంగం పట్ల విపక్షతను ప్రజలకు చాటి చెప్పి ఉత్తేజపరిచి పోరాటాల వైపు మళ్లించిన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు.. జయశంకర్ సార్ జన్మదిన సందర్భంగా ఆయన పుట్టినరోజును తెలంగాణ అస్తిత్వ దినమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.....ఈ కార్యక్రమంలో జయశంకర్ సార్  కొలీగ్, ఓబీసీ జనరల్ సెక్రెటరీ ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ...... తెలంగాణలో ఉన్న ప్రతి ఆర్థిక పరిస్థితి పైన అధ్యయనం చేసి తెలంగాణ రాక ముందుకు టీచర్లకు అధ్యాపకులకు విద్యార్థులకు ప్రవేట్ లో ఉన్న అన్ని సెక్టార్ల ప్రజలకు చైతన్య పరిచిన వ్యక్తి జయశంకర్  అన్నారు....జయశంకర్ సార్ చరిత్ర తెలుసుకుంటే ప్రతి విద్యార్థి విద్యార్థిని, విద్యార్థులు తమ జీవితాలను సక్రమార్గంలో ఉంటారన్నారు..ఈ కార్యక్రమంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం స్టేట్ అడ్వైజర్  వేణుమాధవ్, గౌడ సంఘం అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, బండా వివేకానందం, తెలంగాణ సమాలోచన అధ్యక్షుడు శ్రీనివాస్, నాగరాజు, రాజ్ కుమార్ , రావుల గుండేటి చక్రపాణి ,అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News