_యాదవులపై వరుస దాడులను తిప్పికొడదాం

_బీసీల రక్షణ చట్టం కోసం ఐక్యంగా పోరాడాలి

_రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి పిలుపు
Published On
_యాదవులపై వరుస దాడులను తిప్పికొడదాం

 

 

 

కుత్బుల్లాపూర్, 07( లోకల్ గైడ్ ప్రతినిధి)


యాదవులపై జరుగుతున్న వరుస దాడులు, బీసీ నాయకులపై అక్రమ కేసులు, వేధింపులను తిప్పికొట్టేందుకు బీసీ వర్గాలన్నీ ఐక్యంగా పోరాడాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు పిలుపునిచ్చారు. బీసీలకు ప్రత్యేక రక్షణ కల్పించే చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, బీసీ వర్గాలకు చెందిన యాదవ నాయకుడు వట్టే యాదయ్యతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నమోదైన కేసులను తీవ్రంగా ఖండించారు. బీసీ నాయకులు రాజకీయంగా, సామాజికంగా ఎదుగుతున్న సమయంలో వారిని అడ్డుకునే ప్రయత్నాలను సహించేది లేదన్నారు.
యాదవులపై జరుగుతున్న దాడులు, అక్రమ కేసులు, వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని నాయకులు ప్రకటించారు. ఉద్యమంలో భాగంగా 33 జిల్లాల్లో ప్రెస్‌మీట్లు, నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేస్తామని తెలిపారు.సూర్యాపేటకు చెందిన వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఆయన ఎదుగుదలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి అధ్యక్షుడు మేకల రాములు ఆరోపించారు. ఇలాంటి చర్యలను ఎదుర్కొనేందుకు బీసీలంతా ఐక్యంగా నిలవాలని ఆయన కోరారు.యాదవులపై దాడులు, బీసీ నాయకులపై అక్రమ కేసులు, వేధింపులకు అడ్డుకట్ట వేయాలని, బీసీలకు ప్రత్యేక రక్షణ కల్పించే చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి నాయకులు హెచ్చరించారు.ఈ సమావేశంలో సమితి ప్రధాన కార్యదర్శి వంటల జంగయ్య యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శ్రీనివాస్ యాదవ్, కేసబోయిన వీరేంద్ర యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఎడ్ల కిరణ్ యాదవ్, ధనరాజ్ యాదవ్, పంచక మహేష్ యాదవ్, వట్టేల మహేంద్ర యాదవ్, శివ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News