నవీన్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ నాయక్ దశదిన కార్యక్రమానికి హాజరై నివాళులు

కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపిన వైరా ఎమ్మెల్యే
Published On
నవీన్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్

 

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగస్టు 19 (లోకల్ గైడ్):

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ స్వర్గీయ బానోత్ నవీన్ నాయక్ కుటుంబానికి వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అండగా నిలిచారు.IMG-20260819-WA0135 సింగరేణి మాజీ ఎంపీపీ బానోత్ దేవలా నాయక్ కుమారుడైన నవీన్ నాయక్ దశదిన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ నవీన్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నవీన్ నాయక్ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

నవీన్ నాయక్ అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల తరఫున అవసరమైన సహకారం అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా స్తంభాద్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సుడా ) చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా నియోజకవర్గ పీసీసీ సభ్యులు వడ్డే నారాయణరావు, జిల్లా ఓబీసీ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, సింగరేణి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోటకూరి రాంబాబు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి బానోత్ రామ్మూర్తి నాయక్, అడ్డగోడ ఐలయ్య, వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్, మద్దిని శ్రీనివాసరావు, గూగులోత్ హర్ష నాయక్, గోపాల్ నాయక్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...