నర్సింగ్ కాలేజీ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తాం 

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

- 40 కోట్లతో నర్సింగ్ కాలేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ 
Published On
నర్సింగ్ కాలేజీ నిర్మాణం 18 నెలల్లో పూర్తి చేస్తాం 

మహబూబ్ నగర్ ఆగస్టు 19 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
నర్సింగ్ కాలేజీ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నామని, స్థలం సమకూర్చుకోవడం, ల్యాండ్ అక్విజిషన్‌లో ఎదురైన ఇబ్బందులను అధిగమించి, మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోనే నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.నర్సింగ్ కళాశాల మరియు హాస్టల్ నిర్మాణపు పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  నగరంలోని తిరుమల హిల్స్ నందు మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోనే ఐదు ఎకరాల స్థలాన్ని నర్సింగ్ కాలేజీకి కేటాయించి, రూ.40 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నిధులతో నర్సింగ్ కాలేజీ భవనం, హాస్టల్ భవనాలను రెండు బ్లాకులుగా నిర్మించనున్నట్లు తెలిపారు. మొత్తం దాదాపు 90 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో కాలేజీ బ్లాక్ సుమారు 45,062 చదరపు అడుగులు, హాస్టల్ బ్లాక్ సుమారు 44,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం జరగనుందని తెలిపారు.  నర్సింగ్ కాలేజీ నిర్మాణాన్ని 18 నెలల్లో పూర్తి చేస్తామని కాంట్రాక్టర్ హామీ ఇచ్చారని, నిర్ణీత సమయంలో పనులు పూర్తయితే మహబూబ్‌నగర్‌కు ఇది ఒక గొప్ప ఆస్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న కొత్త జనరల్ హాస్పిటల్‌కు నర్సింగ్ విద్యార్థుల సేవలు, శిక్షణ ఎంతో అవసరమని తెలిపారు. మెడికల్ కాలేజీ క్యాంపస్ నుంచి జనరల్ హాస్పిటల్‌కు బస్ సౌకర్యం కల్పిస్తే నర్సింగ్ విద్యార్థులు,ట్రైనీలు క్రమం తప్పకుండా ఆసుపత్రికి వెళ్లి ప్రాక్టికల్ శిక్షణ పొందడంతో పాటు ప్రజలకు సేవలందించే అవకాశం ఉంటుందన్నారు.నర్సింగ్ కాలేజీ అత్యాధునిక సదుపాయాలతో, అద్భుతమైన వసతులతో నిర్మించనున్నామని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్  గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ లలిత భానుచందర్, నాయకులు మైత్రి యాదయ్య, వాల్ధాస్ ప్రతాప్ గౌడ్, జేసిఆర్, శ్రీశైలం, గ్యాస్ అంజి, గోపాల్ మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ రమేష్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.రాగిణి తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్  శిరీష హత్య నిందితుడిని వెంటనే ఎన్‌కౌంటర్ చేయాలి... గుమ్మడి సందీప్ 
        కారేపల్లి (సింగరేణి) : లోకల్ గైడ్ న్యూస్, సెప్టెంబర్ 1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చేవిటిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకే
మహానేత వైఎస్సార్ విగ్రహావిష్కరణ మరియు వర్ధంతి కార్యక్రమం
ఘనంగా జల మహోత్సవం  మిషన్ భగీరథ నీరు శ్రేష్టమైనది 
చర్ల పీహెచ్‌సీలో ఆశా డే కార్యక్రమం
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల 
వెయ్యి రోజుల్లో వైరా నియోజకవర్గానికి అభివృద్ధి జోరు!...ఎమ్మెల్యే రాందాస్ నాయక్ 
మహానేత డా..వైఎస్సార్ విగ్ర హావిష్కరణ  మరియు వర్ధంతి కార్యక్రమము...