ఉధ్యమాన్ని ముందుండి నడిపించిన ఘనత పెద్దిది

ఉధ్యమంలో వెన్నుదన్నుగా నిలిచే వారు. కుటుంబ సభ్యులను పరమర్శించిన మాజీ సిఎం

పెద్ది  కుటుంబానికి 2 కోట్లా 25 లక్షల ఆర్థిక సహకారం
Published On
ఉధ్యమాన్ని ముందుండి నడిపించిన ఘనత పెద్దిది

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి,ఆగస్టు09
(లోకల్ గైడ్ న్యూస్)

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉధ్యమాన్ని ముందిండి నడిపించిన ఘనత నర్సంపేట మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్రెడ్డికే దక్కుతుందని మాజీ సిఎం కెసిఆర్ అన్నారు. ఆదివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని దివంగత మాజీ ఎంఎల్ఎ ఉధ్యమకారుడు పెద్ది సుదర్శన్రెడ్డి స్వగృహంలో దశదిన కార్యక్రమంలో పాల్గోని కుటుంబ సభ్యులు భార్య స్వప్న, తల్లి అమృతమ్మను పరమర్శించి పెద్ది చిత్ర పటానికి నివాళులు అర్పించారు. నల్లబెల్లి మండల కేంద్రంలో పెద్ది సుదర్శన్రెడ్డి అభిమానులు భారీ సంఖ్యాలో హాజరు కావడంతో మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్రెడ్డి అమరై నినాదలతో నల్లబెల్లి గ్రామం మారుమ్రోగింది. ఎర్రవల్లి నుండి భారీ కాన్వాయ్ నల్లబెల్లి గ్రామానికి మాజీ సిఎం కెసిఆర్ బయలుదేరి సాయంత్రం 3 గంటల 50 నిమిషాలకు పెద్ది ఇంటికి చేరుకున్నారు. మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరమర్శించేందుకు మాజీ సిఎం కెసిఆర్ రావడంతో నర్సంపేట నియోజక వర్గ ప్రజలు పెద్ద సంఖ్యాలో హాజరైనారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్నిIMG-20260809-WA0193 పరమర్శించేందుకు వచ్చిన మాజీ సిఎం కెసిఆర్ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అత్యత్సవంతో పోలీసుల వైపల్యంతో 30 నిమిషాల పాటు కెసిఆర్ కారులోనే ఉండి పోయారు సిఎం కెసిఆర్ అభిమానులు అధికంగా రావడంతో పట్టిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు బిఆర్ఎస్ పార్టీ వర్గాలు అరోపిస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కైన మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డిని కోల్పోవడం బాదకరమని కుటుంబాన్ని కెసిఆర్ ఓదార్చి ధైర్యం చెప్పారు. నర్సంపేట నియోజక వర్గ ప్రజలు, పెద్ది సుదర్శన్ రెడ్డి అభిమానులు అధైర్య పడవద్దని తెలిపారు. కష్టాకాలంతో బిఆర్ఎస్ పార్టీని అదుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని, నియోజక వర్గ ప్రజలకు అదుకుంటానని తెలిపారు. సహచార ఉద్యమ కారున్ని కోల్పోవడం, ఎప్పుడు కెసిఆర్ వెంట ఉండేవారని తెలంగాణ ఉద్యమంటే ప్రాణంగా ప్రేమించే వారని ఆంధ్ర పార్టీలకు బెదరకుండా ఉధ్యమం కోనసాగించారని కెసిఆర్ వెల్లడించారు. కెసిఆర్ కు నమ్మిన బంటుగా నమ్మిన సిద్ధాంతం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డి పని చేసే వారని, పెద్ది భౌతికంగా మన మాధ్య లేకపోయిన ఆయన ఆశయాలకు కార్యకర్తలు పాటు పడాలని సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉధ్యమంలో తనకు తానుగా ఉధ్యమాన్ని మలుచుకున్నారని ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉధ్యమం ఉన్నది అంటే అది పెద్దితోనే మొదలయ్యేదని గుర్తు చేశారు. తెలంగాణ ఉధ్యమకారుడు నర్సంపేట మాజీ ఎంఎల్ఎ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ అదుకోవాలని ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు నిదర్శన్ రెడ్డి, కుతూరు ధర్మిష్టరెడ్డిలకు చేరో కోటి చొప్పున తల్లికి 26 లక్షల ఆర్థిక సహాకారం అందించాలని నిర్ణయించి చెక్కును అందించారు. నల్లబెల్లి గ్రామంలో కెసిఆర్ రాకతో వెయ్యి నుండి 1500 కార్లతో కిక్కిర్సి పోయింది. మాజీ సిఎం కెసిఆర్ వెంట జనగామ ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి,రాజ్యసభసభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర, మాజీ మాత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్రావు,సత్యవతిరాథోడ్, బండా ప్రకాష్, మాజీ స్పీకర్, శాసనమండలి ఫ్లోర్ లీడర్ సిరికొండ మధుసుధనచారి, టి. జీవన్రెడ్డి, పాడి కౌశిక్డ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్కుమార్, మాజీ గిడ్డంగుల చైర్మన్ దివంగత సాయిచంద్ భార్య రజిని, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంఎల్ఎలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, గంగుల కమాలకర్,తో పాటు నర్సంపేట నియోజకవర్గ ముఖ్య నాయకులు, నల్లబెల్లి మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు 
తదితరులు పాల్గోన్నారు.

Tags:

About The Author

Latest News

మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ మూడు నెలలుగా మిస్టరీ.. టెక్నాలజీతో యువతి ఆచూకీ
    ఖమ్మం జిల్లా, కారేపల్లి, ఆగష్టు 24 (లోకల్ గైడ్) : కారేపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు నెలల క్రితం అదృశ్యమైన యువతి ఆచూకీని కారేపల్లి పోలీసులు
ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో గ్రామ/వార్డు సభలు నిర్వహించాలి 
ఖమ్మం వైద్యరంగంలో నవశకం...50 పడకల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభానికి సిద్ధం..
రాష్ట్రం లో అన్ని ప్రాంతాలను సమానాభివృద్ది పథంలో  నడిపిస్తోన్నాం.
ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిష్కరించాలి 
సర్పంచ్ పూసం ఎల్లయ్య ఆధ్వర్యంలో గేట్ కారేపల్లిలో ఫాగ్గింగ్
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం...