చెరువులకు సాగునీరు.. రైతులకు భరోసా!

చీమలవారిగూడెం కట్టు నుంచి అనంతారం, గేట్ కారేపల్లి చెరువులకు నీరు అందించేలా ప్రణాళిక

ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు వివరించిన కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు
Published On
చెరువులకు సాగునీరు.. రైతులకు భరోసా!

 

 

 

ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 10 : రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు చొరవ తీసుకున్నారు. చీమలవారిగూడెం కట్టు నుంచి అనంతారం, గేట్ కారేపల్లి చెరువులకు సాగునీరు అందించేలా చేపట్టాల్సిన నీటి ప్రణాళికను స్థానిక ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ను కలిసి వివరించారు.
చెరువులకు నీరు అందుబాటులోకి వస్తే పరిసర ప్రాంతాల్లోని రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గడంతో పాటు వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని తిరుమలరావు తెలిపారు. వర్షాలపై ఆధారపడే రైతులకు సాగునీటి భరోసా కల్పించేలా ఈ ప్రణాళికను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరారు.
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి వసతుల మెరుగుదలకు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు, రైతుల సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తున్న గుడిపూడి తిరుమలరావుకు రైతులు అభినందనలు తెలిపారు. ఈ ప్రణాళిక కార్యరూపం దాల్చితే ప్రాంతంలోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు