పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి...

83వేల నగదు,10మంది అరెస్టు 

Published On
పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి...

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


మంచిర్యాల జోన్ నెన్నెల పోలీస్‌ స్టేషన్ పరిధిలోని మన్నెగూడెం గ్రామ శివారులో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 83వేల నగదు 8సెల్ ఫోన్లు పదిమందిని అరెస్టు చేసారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,టాస్క్‌ఫోర్స్ ఎసిపి శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐలు రమేష్,లచ్చన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో పేకాట ఆడుతున్న10మందిని,నగదు,8 మొబైల్ ఫోన్లు,ఒక హీరో గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పేకాట నిర్వహించినట్లు గుర్తించిన ఆర్గనైజర్ రాళ్లపేట శ్రీకాంత్‌తో పాటు శ్రీనివాస్,రాజ్‌కుమార్ పరారీలో ఉన్నారు.వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.స్వాధీనం చేసుకున్న నగదు,మొబైల్ ఫోన్లు,ద్విచక్ర వాహనంతో పాటు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను తదుపరి చర్యల కోసం నెన్నెల పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

Tags:

About The Author

Latest News