భాగ్యనగర్ తండా రైల్వే సమస్యపై ఎస్టీ కమిషన్‌కు వినతి

జాటోత్ హుస్సేన్ నాయక్‌కు యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుగులోత్ హర్ష నాయక్ వినతి

Published On
భాగ్యనగర్ తండా రైల్వే సమస్యపై ఎస్టీ కమిషన్‌కు వినతి

 

 

కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 10, లోకల్ గైడ్ న్యూస్ : సింగరేణి మండలం భాగ్యనగర్ తండా, పరిసర ఐదు తండాల ప్రజలు ఎదుర్కొంటున్న రైల్వే రాకపోకల సమస్యను తక్షణమే పరిష్కరించాలని యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గుగులోత్ హర్ష నాయక్ కోరారు. ఈ మేరకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల పట్టాలు, హక్కుల సమస్యలను కూడా ఎస్టీ కమిషన్ సభ్యుడి దృష్టికి తీసుకెళ్లారు. భాగ్యనగర్ తండా, పరిసర తండాలకు చెందిన రైతులు, రైతు కూలీలు ప్రతిరోజూ వ్యవసాయ పనుల కోసం రైల్వే ట్రాక్ దాటి పొలాలకు వెళ్లాల్సి వస్తోందని హర్ష నాయక్ వివరించారు. రైల్వే అధికారులు ట్రాక్ దాటేందుకు అనుమతి నిరాకరించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనుమతి లేకుండా ట్రాక్ దాటితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. ఈ సమస్యపై గతంలో పలుమార్లు అధికారులకు వినతులు సమర్పించినా ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు. ప్రజల భద్రత, రాకపోకల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జరుపుల బాలాజీ చేను సమీపంలోని రైల్వే స్తంభం నంబర్ కేఎస్/5/5 వద్ద అండర్‌పాస్ లేదా రైల్వే గేట్ ఏర్పాటు చేయాలని హర్ష నాయక్ కోరారు. సమస్యను సానుకూలంగా పరిశీలించి సంబంధిత రైల్వే, ప్రభుత్వ అధికారులతో చర్చించి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ హామీ ఇచ్చినట్లు హర్ష నాయక్ తెలిపారు. తండాల ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు, ప్రభుత్వం సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన కోరారు.

Tags:

About The Author

Latest News

తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్.  తుక్కుగూడలో కేటీఆర్ ధర్నా కార్యక్రమానికి వెళుతున్న బి ఆర్ ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్. 
    రాజేంద్ర నగర్ (లోకల్ గైడ్ ): అసెంబ్లీ సమావేశాల సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో బి ఆర్ ఎస్ వర్కింగ్
ఖమ్మం జిల్లాలోని పీఎం శ్రీ పాఠశాలలకు ఆట వస్తువుల సరఫరాకు షార్ట్ టెండర్ ఆహ్వానం…
భాగ్యనగర్ తండా రైల్వే సమస్యపై ఎస్టీ కమిషన్‌కు వినతి
దళిత రైతుల ఆగ్రహం ఉవ్వెత్తున.. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి – లేదంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం
_కొలన్ హనుమంత రెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలకు హాజరైన నాయకులు
పాఠశాలలో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం.
దళితులను అవమానించిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి...