41వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు  కురవి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ 

Published On
41వ చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు  కురవి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్ 

 

 లోకల్ గైడ్ సెప్టెంబర్ 10  కురవి 

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం 
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ  వర్ధంతి సందర్భంగా కురవి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలగాని శ్రీనివాస్ గౌడ్  ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

భూస్వామ్య దోపిడీకి, నిరంకుశత్వానికి ఎదురొడ్డి పేదలు, బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ  చేసిన పోరాటం చిరస్మరణీయం. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన తెగువ నేటి తరానికి స్ఫూర్తిదాయకం.

ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్  సభ్యులు గొల్లపల్లి రజనీకాంత్, కురవి వార్డు సభ్యులు బాదే వీరభద్రం, సూదనపల్లి గ్రామ అధ్యక్షులు గాండ్ల సతీష్, డోర్నకల్ నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కొర్ని అనిల్, మహబూబాద్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు చెన్నూరు వెంకన్న, మాజీ వార్డు సభ్యులు బానోతు లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News