- District News
- Ranga Reddy
- భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ
భక్తిశ్రద్ధలతో పోచమ్మ తల్లికి బోనాల సమర్పణ
పూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు.. పట్టణంలో పండుగ శోభ
Published On
By Ram Reddy
లోకల్ గైడ్ ఆమనగల్లు సెప్టెంబర్ 3:
ఆమనగల్లు పట్టణ పూసల సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల వేడుకలను గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలను అందంగా అలంకరించి, పోచమ్మ తల్లికి సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజలందరూ
ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. బోనాల సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం తో ఆలయ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి. డప్పు చప్పుళ్లు, భక్తిగీతాల తో పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పత్యనాయక్, కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, మొక్తల వెంకటయ్య, ఎర్రవోలు మహేష్, ఎనమల్ల రమేష్, నాగిళ్ల జగన్, పుల్లారెడ్డి అనూష శ్రీశైలం పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
పూసల సంఘం నాయకులు పూసల సత్యం, వెంకటేష్, మోహన్, నారాయణ, నరసింహ, భాస్కర్, మహేష్, అశోక్, సాయిబాబా, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
15 Sep 2026 19:48:59
కుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 (లోకల్ గైడ్ ప్రతినిధి)
హైదరాబాద్: తెలంగాణ సంప్రదాయ వంటకాల ప్రత్యేక రుచులను నగరవాసులకు అందించాలనే ఉద్దేశంతో గాజులరామారం బాలాజీ లేఅవుట్‌లో ‘తెలంగాణ
