యువత జోష్‌తో.. భీక్యాతండాలో ఉట్టి వేడుక!

20 ఏళ్ల సంప్రదాయానికి ఘన కొనసాగింపు – మూడు గంటల పాటు ఉత్సాహంగా సాగిన కార్యక్రమం

Published On
యువత జోష్‌తో.. భీక్యాతండాలో ఉట్టి వేడుక!

 



కారేపల్లి (సింగరేణి), సెప్టెంబర్ 24 (లోకల్ గైడ్ న్యూస్) : సింగరేణి మండలం భీక్యాతండాలో యువత జోష్‌తో ఉట్టి కొట్టే కార్యక్రమం ఘనంగా జరిగింది. గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని గ్రామ యువకులు, గ్రామస్తులు కలిసి ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణేష్ నిమజ్జనానికి ముందు సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ వేడుకతో భీక్యాతండాలో పండుగ సందడి నెలకొంది. గణేష్ నవరాత్రుల తొమ్మిది రోజుల పాటు మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు, చివరి రోజు ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా పాల్గొనగా, చిన్నారులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను ఆసక్తిగా తిలకించారు. అనంతరం గణేష్ నిమజ్జనాన్ని కూడా ఉత్సాహంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని గిరిజన నాయకులు, మాజీ మండల ప్రధాన కార్యదర్శి అజ్మీరా వీరన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భీక్యాతండాలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉట్టి కొట్టే సంప్రదాయం ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. గ్రామ యువకులు ఐక్యంగా కలిసి గణేష్ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా గణేష్ మండపంలో గణనాథుడి చేతిలోని లడ్డూను గ్రామానికి చెందిన ముఖ్య ప్రశాంత్ దంపతులు రూ.12,516కు దక్కించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ భూక్యా రాజేష్తో పాటు గ్రామస్తులు, యువకులు వాంకుడోత్ బావుసింగ్, రాంకీ, నందియా, లచ్చు నాయక్, కిషోర్, రామకృష్ణ, కిరణ్, రమేష్, చంటి, వంశీ, దేవిలాల్, తరుణ్, పండు, సాయి, రాఘవేంద్ర, రామ్‌చరణ్, జగన్, పవన్, మెట్టు, సురేందర్, సురేష్, హోంబ, ధరావత్ కిరణ్, చిట్టి, అరవింద్, అఖిల్, గణేష్, సంతోష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News