కడ్తాల్, సెప్టెంబర్ 9( లోకల్ గైడ్):
తెలంగాణ బహుజన చైతన్యానికి, మహిళాశక్తికి ప్రతీక చాకలి ఐలమ్మ అని జిల్లా సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు, రావిచేడ్ సర్పంచ్ బొప్పిడి గోపాల్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం రావిచేడ్ గ్రామంలో వార్డు సభ్యుడు, రజక సంఘం అధ్యక్షుడు సోమరాజు రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివక్షకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ సాధన ఉద్యమానికి నాంది పలికిందన్నారు. తెలంగాణ చరిత్రలో చిట్యాల ఐలమ్మ పాత్ర వెలకట్టలేనిదన్నారు. బడుగు జీవుల అస్తిత్వాన్ని పరిరక్షించడానికి బందూకు పట్టి సమానత్వం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె స్ఫూర్తితో మనమంతా ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందని, చాకలి ఐలమ్మ స్ఫూర్తిని భావితరాలకు అందించాలన్న సంకల్పంతోనే రావిచేడ్ గ్రామంలో విగ్రహాన్ని ప్రతిష్టించామని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బందరి యాదయ్య, వార్డు సభ్యులు రమేష్, రామస్వామి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు రమేష్ యాదవ్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ యాదయ్య, నాయకులు బాలకృష్ణ, శ్రీనివాస్, లింగం, బిక్షపతి, జితేందర్ రెడ్డి, జమీర్, పవన్ కుమార్, పాండు, రాజు, రాములు, రమేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, దేవేందర్, మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్, రమేష్, యాదగిరి, సత్యనారాయణ, భాస్కర్, గోపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, మహేష్, సాయికుమార్, నరేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.