కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు మేలు

సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్

పెంజర్లలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న సర్పంచ్ జగన్
Published On
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు మేలు

కొత్తూరు సెప్టెంబర్ 10 (లోకల్ గ్రైడ్)

 కాంగ్రెస్ ప్రభుత్వం లోనే పేదలకు మేలు జరుగుతుందని  సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ అన్నారు. గురువారం కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ పథకాలు మరియు సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందించేందుకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.తమకు ఎంతో ఉపయోగపడే స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు ఈ సేవ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ గౌస్, జిపిఓ దామోదర్, డీలర్ రాజేందర్ రెడ్డి,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News