- District News
- శిరీషపై హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ గొండ్వా వాసులు చేపట్టిన దీక్ష
శిరీషపై హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ గొండ్వా వాసులు చేపట్టిన దీక్ష
సంఘీభావం తెలపిన చర్లలో సీపీఎం, సీఐటీయూ, శ్రీ గణేష్ ఆటో యూనియన్ నాయకులు
చర్ల : లోకల్ గైడ్ న్యూస్ :
హైదరాబాద్ తుక్కుగూడలో నర్సు ఊకె శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తూ గొండ్వా వాసులు చేపట్టిన దీక్షకు చర్లలో సీపీఎం, సీఐటీయూ, శ్రీ గణేష్ ఆటో యూనియన్ నాయకులు సంఘీభావం తెలిపారు. చర్ల బస్టాండ్ ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి మచ్చా రామారావు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు వ్యతిరేకంగా సమాజం మొత్తం ఐక్యంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రజలంతా ఏకమై మహిళల భద్రత కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. శిరీష కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని, ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నాయకులు కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, మహిళలపై హింసకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, శ్రీ గణేష్ ఆటో యూనియన్ అధ్యక్షులు పామరు బాలాజీ, కార్యదర్శి కోడిరెక్కల నాగరాజు, ఉపాధ్యక్షులు బాలరాజుల సత్తిరాజు, చల్ల సతీష్, వేణు, తులసి మణికంఠ, వెంకటరావు, సీఐటీయూ–శ్రీ గణేష్ ఆటో యూనియన్ మండల కమిటీ నాయకులు, యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
