సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కులకై పోరాడుదాం.

Published On
సర్వాయి పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మిక హక్కులకై పోరాడుదాం.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. లోకల్ గైడ్.

   16వ శతాబ్దం నాటి  విప్లవ యోధుడు సర్దార్ పాపన్న స్ఫూర్తితో కలుగీత కార్మికుల హక్కుల రక్షణకై పోరాడుదామని *తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న పిలుపునిచ్చారు.మంగళవారం తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న 376 జయంతిని సుందరయ్య భవన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  సబ్బండవర్గ ప్రజలను ఏకం చేసి రాజులు భూస్వాములకు, దోపిడికి వ్యతిరేకంగా ఎదురొడ్డి తెల్లోడి పాలన మీద తిరుగుబాటు ప్రకటించి దేశానికి స్వాతంత్య్రం సంపాదించి పెట్టిన ఎందరో స్వాతంత్య్ర సమరయోధులకు చరిత్రలో స్థానం దక్కడం సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్న భూస్వాములు, దొరల గుత్తాధిపత్యాన్ని ఎదురించి తానే సొంతంగా ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఏకంగా గోల్కోండ కోటనే ఏలిన ధీరుడిగా చరిత్రకెక్కిన ఒక బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. బహుజనులకే రాజ్యాధికారం దక్కాలని 17వ శతాబ్ధంలోనే గొంతెత్తి నినదించడమే కాదు..పిడికిలి ఎత్తి పోరాడి గెలిచిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా జనగాం తాలూకాబెల్గాం గ్రామం 1650 ఆగస్టు 18న పుట్టిన పాపన్న... పాతికేండ్ల యవస్సులోనే విప్లవవీరునిగా మారాడు.చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అభ్యుదయ భావాలతో రెబలిస్టిక్ అప్రోచ్తో ఉండేవాడని చరిత్ర చెబుతోంది. అట్టడుగువర్గాల బానిస బతుకుల్లో వెలుగులు నింపేందుకు పోరాడిన యోధుడు పాపన్న స్ఫూర్తితో కల్లుగీత కార్మికుల పెండింగ్ ఎక్స్గ్రేషియా నిధులు విడుదల చేయాలని కల్లుగీత తో పాటు నీరా అనుబంధ వృత్తుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు నిధులు కేటాయింప చేయడం కోసం ప్రజా పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా సీనియర్ నాయకులు వేములకొండ పుల్లయ్య హాలియా అధ్యక్షులు నర్సింగ్ సైదులు, కార్యదర్శి కాట్నం పరమేష్ ఉపాధ్యక్షులు కాసాని సత్తయ్య ,పొడిశెట్టి వీరయ్య, తండు శివశంకర్, దేవరకొండ లింగమయ్య, గుండు శీను కట్నం నవీన్ కప్పల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News