హర్ ఘర్ తిరంగా...ఐక్యతను చాటుదాం ఘనంగా

,బిజెపి నేత నాగురావు నామాజీ 

Published On
హర్ ఘర్ తిరంగా...ఐక్యతను చాటుదాం ఘనంగా


నారాయణపేట ఆగస్టు 13:
ఘర్ ఘర్ తిరంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సందర్భంగా గురువారం నారాయణపేటలోని తన నివాసంపై  బిజెపి రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమ శిక్షణ సంఘం సభ్యులు నాగురావు నామాజీ జాతీయ జెండాను ఆవిష్క రించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం స్వతంత్ర ఉద్యమం నాటికి దేశంలో దాదాపు 10 కోట్ల మంది భారతీయులు తమ తమ ఇళ్లపై 15 ఆగస్టు నాడు మరి అంతకు ముందు మూడు రోజులు జాతీయ జెండాను ఆవిష్కరించి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డరని అన్నారు.ఆ పిలుపుకు కొనసాగింపుగా ఈ సంవత్సరము ""1942 ఆగస్టు 9న జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం"" స్ఫూర్తితో ఆగస్టు 9 నుండి 17 ఆగస్టు వరకు దేశవ్యా ప్తంగా ప్రతి ఊరిలో ప్రతి ఇంటి పై భారత జాతీయ జెండాను ఎగురవేసి జాతీ య స్ఫూర్తిని పెంపొందించా లని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 10వ తేదీ నుండి 15 ఆగస్టు  వరకు ప్రతి ఒక్కరూ ఈ "" ఆపూర్వ జెండా ప్రతి ఇంటి పై జెండా"" ఎగరాలని కోరారు.ఇదే స్ఫూర్తితో నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు ప్రతి పల్లెలో ప్రతి ఇంటి పైన జెండాను ఎగుర వేయవల సిందిగా భారతీయులం దరినీ కోరినారు.ఈ పిలుపును అమలు చేసి దేశద్రోహుల ఆట కట్టివే యాలని ప్రతి ఒక్కరిలో జాతీయ జెండాపై భక్తిని పెంచాలని దేశభక్తిని రగి లించాలని జాతి పునర్ నిర్మాణంలో భాగస్వా ములు కావాలని రాజకీ యాలకు అతీతంగా ప్రతి భారతీయుడు ఈ స్వాతం త్ర దినోత్సవ శుభాకాంక్షలు జాతీయ జెండాలు ఎగుర వేసి మరొకసారి దేశభక్తి, ఐక్యతను  చాటుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ అదనపు న్యాయవాది నందు నామాజీ,బిజెపి నాయకులు హనుమంతురావు,కుమార్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:3..జెండా ఎగురవేసిన నాగురావు నామాజీ 
_____________________

Tags:

About The Author

Latest News

ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం... ఈనెల 31న సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ప్రారంభోత్సవం...
    మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్కూల్ బ్రేక్‌ఫాస్ట్ ప్రోగ్రాంలో భాగంగా మంచిర్యాల మెడికల్ కళాశాల గోడౌన్ ప్రాంగణంలో
మతసామరస్యంతోనే సమాజంలో శాంతి.
నూతన "శుభం కన్వెన్షన్" ప్రారంభం.
ఖమ్మం జిల్లా లో మొట్ట మొదటి సారిగా పోలీస్ ఉద్యోగి నుంచి వచ్చిన అకాడమీ ఒకె ఒక అకాడమీ వి.ఐ.పి పోలీస్ అకాడమీ..
శివ రెడ్డి పేట్ లో ఘనంగా మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు
మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా అన్నదానం.
_______ముఖ్య శిక్షక్ కుమారుని పెళ్ళిలో బిజెపి నేతల సందడి