_జీవిత బీమా, సాధారణ బీమా సేవలు ఒకే వేదికపై అందించడం అభినందనీయం

_కార్పొరేట్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ కార్యాలయం ప్రారంభం.. ప్రత్యేక బ్రోచర్‌ను ఆవిష్కరించిన లయన్ డాక్టర్ సీఎంఏ దుర్గాప్రసాద్

Published On
_జీవిత బీమా, సాధారణ బీమా సేవలు ఒకే వేదికపై అందించడం అభినందనీయం

 

 


కుత్బుల్లాపూర్ అక్టోబర్ 24 ( లోకల్ గైడ్ ప్రతినిధి)


జీవిత బీమా, సాధారణ బీమా సేవలను ఒకే వేదికపై అందిస్తూ ప్రజలకు సమగ్ర బీమా రక్షణ, ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో నూతన మారుతి నగర్‌లో ఏర్పాటు చేసిన కార్పొరేట్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ కార్యాలయాన్ని విజయదశమి పర్వదినం సందర్భంగా ఘనంగా ప్రారంభించారు. పేరి నాగేశ్వరరావు,  పేరి పి. విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ మాజీ చైర్మన్, ప్రస్తుత డైరెక్టర్ లయన్ డాక్టర్ సీఎంఏ దుర్గాప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం సంస్థ ప్రత్యేక బ్రోచర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, బీమా రంగంలో 43 సంవత్సరాలకు పైగా విశేష అనుభవం కలిగిన లయన్ పేరి నాగేశ్వరరావు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో అండర్‌రైటింగ్, క్లెయిమ్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి కీలక విభాగాల్లో ఆయనకు విశేష పరిజ్ఞానం, అనుభవం ఉన్నాయని తెలిపారు. ఖాతాదారుల అవసరాలు, వ్యాపార స్వభావం, ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి తగిన బీమా రక్షణను సూచించడంలో ఆయన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.అదేవిధంగా  పేరి పి. విజయలక్ష్మి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వ్యక్తిగత జీవిత బీమాతో పాటు కార్పొరేట్ బీమా అవసరాలకు అనుగుణంగా పాలసీలను సూచిస్తూ, కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో ఆమెకు మంచి అనుభవం ఉందని ప్రశంసించారు.జీవిత బీమా, సాధారణ బీమా సేవలను ఒకే వేదికపై అందించడం వినూత్నమైన ప్రయత్నం అని డాక్టర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కుటుంబానికి జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా అవసరమని, వ్యాపార సంస్థలకు ఆస్తులు, బాధ్యతలు, వ్యాపార కార్యకలాపాలకు తగిన బీమా రక్షణ ఎంతో ముఖ్యమని వివరించారు. ఈ సంస్థ ద్వారా ఖాతాదారులకు సరైన పాలసీ ఎంపికపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన సమయంలో క్లెయిమ్ ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకత్వం అందించడం అభినందనీయమని అన్నారు.ఈ సందర్భంగా పేరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, బీమా రంగంలో నాలుగు దశాబ్దాలకు పైగా సంపాదించిన అనుభవాన్ని ప్రజల ప్రయోజనాలకు వినియోగించాలనే సంకల్పంతో కార్పొరేట్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. బీమా పాలసీ తీసుకునే ముందు దాని నిబంధనలు, కవరేజీలు, మినహాయింపుల గురించి ఖాతాదారులకు స్పష్టంగా వివరించడం తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. బీమా రక్షణలో ఉన్న లోటుపాట్లను గుర్తించి, అవసరమైన సమయంలో క్లెయిమ్ ప్రక్రియలో తగిన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పేరి పి. విజయలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి కుటుంబానికి భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించడంలో జీవిత బీమా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వ్యక్తుల ఆదాయం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు అవసరాలు, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకుని తగిన బీమా పరిష్కారాలను సూచించడం తమ సేవా విధానమని వివరించారు.కార్యక్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌కు చెందిన అధికారులు, బీమా రంగ ప్రముఖులు, శ్రేయోభిలాషులు, మిత్రులు పాల్గొన్నారు. విజయదశమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీమతి విజయలక్ష్మి తల్లిదండ్రులు శ్రీ పప్పు శేషగిరిరావు దంపతులు కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరై ఆశీస్సులు అందించారు.“ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వడం మా పని మాత్రమే కాదు.. ఆ పాలసీఅవసరమైనప్పుడు మీకు అండగా నిలబడటమే మా అసలైన సేవ” అనే నినాదంతో సంస్థ ముందుకు సాగుతోంది. అనుభవం, నమ్మకం, సరైన పాలసీ ఎంపిక, రిస్క్ మేనేజ్‌మెంట్, క్లెయిమ్ మార్గదర్శకత్వాన్ని ప్రధాన లక్ష్యాలుగా చేసుకుని మరింత అభివృద్ధి సాధించాలని, వేలాది కుటుంబాలకు, వ్యాపార సంస్థలకు ఆర్థిక భద్రత కల్పించాలని ముఖ్య అతిథి ఆకాంక్షించారు.
“మా నమ్మకం – మీ భద్రత – మా బాధ్యత” అనే లక్ష్యంతో ప్రారంభమైన కార్పొరేట్ ఇన్సూరెన్స్ సొల్యూషన్స్ ప్రజలకు సమగ్ర బీమా సేవలు అందించడంలో ముందుకు సాగాలని కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ఆకాంక్షించారు.

Tags:

About The Author

Latest News

ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్ ఎన్కతల గ్రామంలో  పశువుల నీటి తొట్టి నిర్మాణానికి మార్కింగ్
    లోకల్ గైడ్, మోమిన్ పేట్ వికారాబాద్ జిల్లా : మోమిన్ పేట మండల పరిధిలోని ఎన్కతల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామ పంచాయతీ మరియు
ఓట్‌చోరీపై  పోరాటం చేస్తాం - కాంగ్రెస్ పార్టీ నాయకులు. 
డిగ్రీ, గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకోవాలి బి ఆర్ ఎస్ కాటేదాన్ డివిజన్ అధ్యక్షులు ఎస్. వెంకటేష్.                                              
తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్–2026 లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోకల శ్రీనివాస్ రెడ్డి. 
సింగరేణి మండల గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆరెళ్ల రవి గౌడ్
మేధావుల గళం.. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా!
నర్సంపేట మండలంలో పైపులైన్ లీకేజీతో మిషన్ భగీరథ వృథాగా పోతున్న నీరు