- District News
- Mahabubnagar
- విద్య, పరిశోధన, ఆవిష్కరణలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం
విద్య, పరిశోధన, ఆవిష్కరణలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం
పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విజన్
-
మహబూబ్‌నగర్ ఆగస్టు 8 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కంహ శాంతి వనంలో నిర్వహిస్తున్న *“విజన్ ఇండియా–2047”* రెండు రోజుల జాతీయ సదస్సు రెండో రోజు కార్యక్రమాలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా డాక్టర్ జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది విద్యార్థులకు ఇంగ్లీషులో చదవడం, లెక్కలు చేయడం, కనీసం తెలుగులో చదవడం కూడా సరిగా రాని పరిస్థితులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వారు పోటీ ప్రపంచంలో ఎలా రాణించగలరనే అంశాన్ని ముఖ్యమంత్రి గుర్తించి విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రజాప్రతినిధుల కృషి.పాలమూరు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, గతంలో విశ్వవిద్యాలయాన్ని నల్గొండకు కేటాయించి నాగార్జునసాగర్‌తో అనుసంధానం చేయాలనే ప్రయత్నం జరిగినప్పుడు పాలమూరు ప్రాంత విద్యార్థులు హైదరాబాద్‌కు వెళ్లి, అక్కడి నుంచి నల్గొండకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేదని తెలిపారు. దీనివల్ల విద్యార్థులు ఎదుర్కొనే ఇబ్బందులను అప్పటి ప్రజాప్రతినిధులు గుర్తించి, ప్రత్యేకంగా పాలమూరుకు విశ్వవిద్యాలయం కావాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కలిసి పాలమూరు విశ్వవిద్యాలయం మంజూరు చేయించుకున్నామని వివరించారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిర్మిస్తున్న విశ్వవిద్యాలయ భవనాల్లో పాలమూరు విశ్వవిద్యాలయం భవనాలు అత్యంత మెరుగ్గా ఉండేలా అభివృద్ధి జరుగుతోందని *డాక్టర్ జి.చిన్నారెడ్డి ప్రశంసించారు. క్రీడలతో విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన ఆలోచనా విధానం.పాఠశాలలు, కళాశాలల్లో క్రీడలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులను గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడంతో పాటు విద్య, క్రీడలపై ఆసక్తి పెంచవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు.ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో భారతదేశం మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.జాతీయ సదస్సుల ద్వారా కొత్త ఆవిష్కరణలు, నూతన పరిశోధనలు వెలుగులోకి రావాలని ఆయన ఆకాంక్షించారు.వాతావరణ మార్పుల ప్రభావంతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశోధనల ద్వారా పరిష్కరించేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు కృషి చేయాలని సూచించారు.పాలమూరు విశ్వవిద్యాలయం అభివృద్ధికి, ఆర్థిక వనరుల సమీకరణకు, విద్యా అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సమర్పిస్తే, ముఖ్యమంత్రి స్వయంగా పాలమూరు జిల్లా వాసి అయినందున ఆయనతో మాట్లాడి నిధులు మంజూరు చేయించేందుకు తమ వంతు కృషి చేస్తామని డాక్టర్ చిన్నారెడ్డి హామీ ఇచ్చారు. పాలమూరు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇలాంటి జాతీయ స్థాయి సదస్సులు నిర్వహించడం శుభపరిణామమని అన్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి.కె. అరుణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలపాలనే పట్టుదలతో పనిచేస్తున్నారని తెలిపారు.
సక్సెస్, న్యూ రిసోర్సెస్, ఇన్నోవేషన్స్, ఇంటరాక్షన్, న్యూ కొలాబరేషన్స్* వంటి అంశాల ద్వారా భారతదేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ఆకాంక్షించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందని పేర్కొన్నారు.పాలమూరు విశ్వవిద్యాలయం పరిశోధన, స్టార్టప్‌లు, సాంకేతికత రంగాల్లో ముందంజలో నిలవాలని ఆమె ఆకాంక్షించారు. భారత ప్రభుత్వం ఎడ్యుకేషన్, ఎంపవర్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, ఇన్నోవేషన్, టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. దేశంలోని యువతకు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యను అభ్యసించి ఉన్నత రంగాల్లో రాణించాలని సూచించారు.విశ్వవిద్యాలయాల అభివృద్ధి, యువత అభివృద్ధి, మహిళల అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి* సమాంతరంగా జరిగినప్పుడే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని డి.కె. అరుణ పేర్కొన్నారు.
పీఎం ఉషా నిధులతో పాలమూరు విశ్వవిద్యాలయంలో అభివృద్ధి పనులు
పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, పీఎం ఉషా నిధులతో విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల, బాలికల వసతి గృహాలు, బాలుర వసతి గృహాల నిర్మాణ పనులు చేపడుతున్నామని తెలిపారు.అదేవిధంగా కొల్లాపూర్, గద్వాల, వనపర్తి పీజీ కేంద్రాల్లో కూడా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విశ్వవిద్యాలయాన్ని ముందువరుసలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.విద్యార్థుల్లో నూతన ఆలోచనలు, పరిశోధనా దృక్పథం, సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో విశ్వవిద్యాలయాలు కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పాలమూరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, జాతీయ సదస్సు కన్వీనర్లు ప్రొఫెసర్ డి. మధుసూదన్ రెడ్డి,డాక్టర్ కె. ప్రవీణ ఇతరులు పాల్గొన్నారు
