రైతుల సాగునీటి కష్టాలకు చెక్‌.. ప్రాజెక్టులపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టి

Published On
రైతుల సాగునీటి కష్టాలకు చెక్‌.. ప్రాజెక్టులపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టి

 


ఖమ్మం జిల్లా, కారేపల్లి (సింగరేణి ) : లోకల్ గైడ్, ఆగష్టు 8 : పెరుపల్లి గ్రామానికి సంబంధించిన ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన కోటిలింగాల ఆయకట్టు, నాగరాజు కట్టు, పెరుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ఇరిగేషన్ అధికారులు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గౌరవ ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు అధికారులు ఈ మూడు ప్రాజెక్టులను సందర్శించి, వాటి ప్రస్తుత పరిస్థితి, రైతులకు సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వివరాలు సేకరించారు.
పెరుపల్లి ప్రాంత రైతులకు సాగునీరు అందించడంలో ఈ మూడు ప్రాజెక్టులు కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసిన అధికారులు, అవసరమైన పనులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే ఎమ్మెల్యేకు సమర్పిస్తామని తెలిపారు.
సాగునీటి ప్రాజెక్టులు అభివృద్ధి చెందితే పెరుపల్లి పరిసర ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు నీటి సమస్యలు తగ్గుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. తమ సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపడంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు బొల్ల రమేష్, గ్రామ కాంగ్రెస్ నాయకులు బచ్చలకూరి ఉపేందర్, రైతులు అలెం చంద్రయ్య, గురవయ్య, ధనసరి వెంకన్న, వజ రాంబాబు, ధామల్ల రామారావు, పప్పుల ప్రవీణ్, మూతి ఎర్రయ్య, లక్ష్మీనారాయణ, అలెం రాంబాబు, బాటయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న డా.రసమయి బాలకిషన్‌కు ఘన స్వాగతం అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న డా.రసమయి బాలకిషన్‌కు ఘన స్వాగతం
బెజ్జంకి ఆగస్ట్ 8 (లోకల్ గైడ్): అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత డా. రసమయి బాలకిషన్‌కు...
విద్య, పరిశోధన, ఆవిష్కరణలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం
రైతుల సాగునీటి కష్టాలకు చెక్‌.. ప్రాజెక్టులపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టి
పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ ప్రధాన లక్ష్యం. 
ఉపసర్పంచ్‌పై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలి
'సర్ 'కు నావంతు బాధ్యత వహించాను 
అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన  బడే హర్షిత..