అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన  బడే హర్షిత..

Published On
అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన  బడే హర్షిత..

 

వాజేడు, లొకల్ గైడ్ ప్రతినిధి :-

ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పూసురు గ్రామానికి చెందిన బడే సాంబాశివరావు నాగమణి దంపతులకు హర్షిత,వర్షిణి అనే ఇద్దరు కవలలు.హర్షిత ప్రస్తుతం పెద్దగొల్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నారు.హర్షిత చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయింది.చిన్నప్పటి నుంచి  తండ్రి సాంబశివరావు తన పిల్లలను కష్టపడి చదివించి పోషించారు.హర్షిత,వర్షిణి ఇద్దరు చదువులోనూ మరోవైపు క్రీడల్లోనూ తమ ప్రతిభను కనబరుస్తూ జిల్లా,రాష్ట్ర స్థాయిలోనూ రాణిస్తున్నారు.కాగా శుక్రవారం హన్మకొండలో జరిగిన తెలంగాణ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్,లాంగ్ జంప్ లో హర్షిత సిల్వర్ మెడల్ పతకం సాధించింది.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు,కోచ్,తండ్రి, గ్రామస్తులు చిన్నారిని అభినందించారు.

Tags:

About The Author

Latest News

అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న డా.రసమయి బాలకిషన్‌కు ఘన స్వాగతం అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న డా.రసమయి బాలకిషన్‌కు ఘన స్వాగతం
బెజ్జంకి ఆగస్ట్ 8 (లోకల్ గైడ్): అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత డా. రసమయి బాలకిషన్‌కు...
విద్య, పరిశోధన, ఆవిష్కరణలతోనే 2047 నాటికి వికసిత్ భారత్ సాధ్యం
రైతుల సాగునీటి కష్టాలకు చెక్‌.. ప్రాజెక్టులపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ దృష్టి
పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే ఎస్ ఐ ఆర్ ప్రధాన లక్ష్యం. 
ఉపసర్పంచ్‌పై దాడి.. కఠిన చర్యలు తీసుకోవాలి
'సర్ 'కు నావంతు బాధ్యత వహించాను 
అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో సిల్వర్ మెడల్ సాధించిన  బడే హర్షిత..