రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలి

దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి. - మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వేసుకునే పంటలపై దృష్టి సారించాలి 

రైతులకు మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త సూచన
Published On
రైతుల ఆదాయం పెంచేందుకు ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించాలి

మహబూబ్ నగర్ ఆగస్టు 19 (లోకల్ గైడ్ ప్రతినిధి జీవి గౌడ్)
రైతుల ఆదాయం పెంచడంతో పాటు నీటి వనరులు, భూసారాన్ని పరిరక్షించేందుకు ఉద్యానవన, తక్కువ నీటి వినియోగ పంటల సాగును ప్రోత్సహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు.బుధవారం భూత్పూర్ మండలం శేరిపల్లి గ్రామంలో జిల్లా ఉద్యానవన, పట్టుపరిశ్రమ శాఖల ఆధ్వర్యంలో రైతులకు, గ్రామ సర్పంచ్‌లకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ సి.ఎం.డి జితేష్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు మారి వర్షాభావం ఏర్పడుతున్నందున వరికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, ఆయిల్‌పామ్,IMG-20260819-WA0190 చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర పంటల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో *ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి* మాట్లాడుతూ పంటల మార్పిడి, ఆధునిక సాగు పద్ధతులను రైతులు అవలంబించాలని సూచించారు. తక్కువ వర్షపాతం, భవిష్యత్ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటలను ఎంచుకోవాలన్నారు. రైతులకు నాణ్యమైన కూరగాయల నారు, విత్తనాలు, మల్చింగ్, పందిళ్ల సాగు వంటి సదుపాయాలను ప్రభుత్వం అందిస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు సమూహాలుగా ఏర్పడి సాగు వివరాలను ఉద్యానవన శాఖకు అందిస్తే అవసరమైన నారును తెప్పించి అందించే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని, కొత్తకోట సమీపంలోని శంకరెడ్డిపల్లిలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి వస్తే మార్కెటింగ్ సమస్యలు తగ్గుతాయని పేర్కొన్నారు. రైతులకు సబ్సిడీలు త్వరగా మంజూరు చేయాలని అధికారులను కోరారు. అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గంలోని గ్రామాల్లో తక్కువ వోల్టేజీ, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగలు తదితర సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారి టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్. సి.ఎం 
డి. జితేష్ పాటిల్ ను  కోరారు. అలాగే బూత్‌పూర్‌లో విద్యుత్ సబ్‌డివిజన్ కార్యాలయంతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.టి.జి.ఎస్.పి.డి.సి.ఎల్ సి.ఎం.డి జితేష్ పాటిల్ మాట్లాడుతూ వ్యవసాయాన్ని కేవలం ఒకే పంటకు పరిమితం చేయకుండా పాడి, మేకల పెంపకం, చేపలు, తేనెటీగల పెంపకం, ఉద్యాన పంటలు, కూరగాయలు వంటి అనుబంధ రంగాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొత్త పంటలను ముందుగా చిన్న విస్తీర్ణంలో ప్రయోగాత్మకంగా సాగు చేసి, ఫలితాలను బట్టి విస్తరించాలన్నారు. మార్కెట్ అవకాశాలను ముందుగానే గుర్తించి ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. మట్టిని కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని, పంట అవశేషాలను కాల్చకుండా సేంద్రియ పదార్థాలుగా మార్చి భూమికి అందించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు, అనిశ్చిత వర్షపాతం, భూగర్భ జలాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల సాగు విధానంలో మార్పులు చేసుకోవాలని సూచించారు. వరి, పత్తితో పాటు కూరగాయలు, పూలు, ఆయిల్‌పామ్, పప్పుధాన్యాలు, నువ్వులు, ఆముదం వంటి ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించాలన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ గ్రామాల్లో కొంతమంది రైతులతో ప్రయోగాత్మకంగా పంటల మార్పిడిని ప్రారంభించి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహాయం, విత్తనాలు, వ్యవసాయ సమాచారం అందించేందుకు జిల్లా యంత్రాంగం, సంబంధిత శాఖలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.అంతకు ముందు *జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వేణుగోపాల్* పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో ఉద్యానవన శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను, రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీల గురించి వివరించారు. తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఆయిల్‌పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటలను రైతులు చేపట్టాలని సూచించారు. డ్రిప్, మైక్రో ఇరిగేషన్, మల్చింగ్, పందిళ్లు, నాణ్యమైన నారు వంటి సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. స్థానిక మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలను ఎంచుకుని ముందస్తు మార్కెటింగ్ ప్రణాళికతో సాగు చేయాలని  సూచించారు.తొలుత, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, సి. ఎం .డి జితేష్ పాటిల్ తో కలిసి శేరిపల్లి రైతులు వీరస్వామి, లక్ష్మయ్య సాగు చేస్తున్న కాకరకాయ, చిక్కుడుకాయ తోటలను పరిశీలించారు. రైతులు ఎకరాకు సుమారు రూ.20 వేల పెట్టుబడితో సాగు చేస్తున్నామని, అనుకూల దిగుబడి వస్తే మూడు నెలల్లో సుమారు రూ.2 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వివరించారు. అనంతరం ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి సాగు ఉపకరణాలు, తేనె ఉత్పత్తులు, రైతులకు అందించనున్న కూరగాయల నారును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, వ్యవసాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, గ్రామ సర్పంచ్‌లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News