ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర.. మహానేత వైఎస్సార్‌

ఆమనగల్లు లో ఘనంగా డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి

సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ ప్రతీక.. ఆయన ఆశయాలే కాంగ్రెస్‌కు మార్గదర్శకం
Published On
ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర.. మహానేత వైఎస్సార్‌

లోకల్‌ గైడ్‌
ఆమనగల్లు, సెప్టెంబర్‌ 2 
పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కాంగ్రెస్‌ నాయకులు కొనియాడారు. వైఎస్సార్‌ 17వ వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆమనగల్లులో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అవ్వారి శివలింగం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన్‌ పత్య నాయక్‌ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు మహానేతను స్మరించుకుంటూ ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా కసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసి ప్రజల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారని అన్నారు. ముఖ్యంగా రైతులు, పేదల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోయాయని పేర్కొన్నారు.
ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన వైఎస్సార్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ వస్పుల శ్రీశైలం, కోఆప్షన్‌ సభ్యుడు అబ్దుల్‌ ఖాదర్, సీనియర్‌ నాయకులు దావా ధనుంజయ, కొండల్‌రెడ్డి, దాస్‌ నాయక్, కాలే మల్లయ్య, ఖాదర్‌ ఖాద్రి, గాజుల శ్రీను, ఆదివాసీ రాష్ట్ర నాయకుడు కృష్ణ నాయక్, శేఖర్‌రెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎంగలి ప్రసాద్, నాయకులు బాబా, అండేకర్‌ రాజు, రహీం, కరీం, మల్లేష్‌ నాయక్, వస్పుల శ్రీకాంత్, ఎండీ ఫరీద్, దేవరశెట్టి మహేష్, శ్రీధర్‌ నాయక్, గోపాల్‌ నాయక్, నాజర్, మహేష్, దుడ్డు కృష్ణయాదవ్, బొబ్బిలి, హరిలాల్, పూసల పరమేష్, అంజాత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News