- District News
- Mahabubnagar
- మైలార్దేవపల్లి లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.
మైలార్దేవపల్లి లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.
రాజేంద్ర నగర్, ( లోకల్ గైడ్ ):
మైలార్దేవపల్లి లోని దుర్గా కన్వెన్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు బుధవారం ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
ముందుగా ఆదర్శ ఉపాధ్యాయుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రదానోత్సవం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు, అవార్డులను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువులు పోషిస్తున్న కీలక పాత్రను వారి నిస్వార్థ సేవలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొనియాడారు.
ఈ వేడుకల్లో మండల విద్యాధికారి శంకర్ రాథోడ్, యూ టి ఎఫ్ జిల్లా అధ్యక్షులు గోపాల్ నాయక్, జీ హెచ్ ఎం చంద్రశేఖర్ రెడ్డి, రవి, శ్రీనివాస్ మండలం పరిధిలోని పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, స్థానిక నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
