- District News
- జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
ఏ ఐ యూ కె ఎస్ రాష్ట్ర కార్యదర్శి బి. రాము
నారాయణపేట ఆగస్టు 7:
అమెరికాతో భారత్ కుదు ర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాల నీ, ఇది భారతప్రజానీకానికి వ్యతిరేకమని ఈ ఒప్పందా న్ని వెంటనే రద్దు చేసుకోవా లని ఏఐయుకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బి రాము, సీపీ ఎం జిల్లా కార్యదర్శి వెంక ట్రామి రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రద్దు డిమాండ్ చేస్తూ ఈనెల 10న దేశవ్యాప్తంగా జరిగే నిరసనలు, జైలు బరో కార్యక్రమంలో అశేష కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. కార్యక్రమ గోడపత్రికను స్థానిక అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించారుఈ సంద ర్బంగా ఆయన మాట్లాడు తూ మోడీ అధికారం లోకి వచ్చిన తరువాత సామ్రా జ్య వాద అమెరికా ముందు సాగిలాపడి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటు న్నారన్నారు.ఇలాంటి ఒప్పందాలు, కార్మిక వ్యతి రేక చట్టాలను వెతిరేకస్తూ ఈ నెల పదిన జరిగే జైలు బరో కార్యక్రమం నిర్వహిస్తు న్నట్లు తెలిపారు ఈ కార్యక్రమం లో , మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కె. కాశినాథ్, ఏ ఐ యూ కె ఎస్ జిల్లా అధ్యక్షకార్యదర్శి లు భగవంతు, యాదగిరి, వ్యవసాయ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిల య్య గౌడ్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బల్ రాం, టీ యూ సి ఐ జిల్లా కార్య దర్శి బోయిన్ పల్లి రాము, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:గోడ పత్రిక ఆవిష్కరించిన వామపక్ష నాయకులు
____________________
