ప్రశాంతంగా బోనాల బందోబస్తు

Published On
ప్రశాంతంగా బోనాల బందోబస్తు

 

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, లోకల్ గైడ్, ఆగస్టు 10:-

 బోనాల ఉత్సవాల సందర్భంగా మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో చేపట్టిన బందోబస్తు ప్రశాంతంగా ముగిసింది. పోలీసుల పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు, భక్తుల సహకారంతో ఉత్సవాలు, అమ్మవారి ఊరేగింపులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా సాగాయి.

ఉత్సవాల సందర్భంగా రద్దీ ప్రాంతాలు, ఆలయాలు, ఊరేగింపు మార్గాల్లో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు భక్తుల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టారు. పోలీసు సిబ్బంది సమన్వయంతో బందోబస్తు విధులు నిర్వహించారు.

భక్తుల సహకారంతోనే ప్రశాంత వాతావరణంలో బోనాల ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని పోలీసులు తెలిపారు. “మీ భద్రత మా బాధ్యత.. మీ నమ్మకమే మా బలం” అని మల్కాజిగిరి పోలీసులు పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News