- District News
- వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి
వినాయక మండపాల నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇవ్వాలి
ఈనెల14నుండి వినాయక చవితి పండుగ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించే వారు తప్పనిసరిగా పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని వన్ టౌన్ సిఐ కె శ్రీనివాసరావు తెలిపారు.వినాయక విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.ఇందుకోసం https://policeportal.tspolice.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తుదారుని వివరాలు,విగ్రహం ఏర్పాటు చేసే ప్రదేశం,ఆ ప్రదేశం ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో,విగ్రహం ఎత్తు,మండపం ఎత్తు,కమిటీ సభ్యుల పేర్లు,వారి ఫోన్ నంబర్లు,విగ్రహాన్ని ప్రతిష్ఠాపన,నిమజ్జనం చేసే తేదీ,సమయం,ప్రదేశం,నిమజ్జనం చేసే ప్రదేశానికి చేరుకునే వాహనం వివరాలను నమోదు చేయాలని,అదేవిధంగా మండప నిర్వాహకులు,గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు,వాలంటీర్ల పేర్లు,ఫోన్ నంబర్లు,చిరునామా తదితర వివరాలను కూడా పూర్తిగా నమోదు చేయాలని సూచించారు.గణపతి మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేయాలని కోరారు.ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయడంలో ఇబ్బందులు ఎదురైతే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు.పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీ సభ్యులు మట్టి వినాయక విగ్రహాల ప్రతిష్ఠాపనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా పోలీస్ యంత్రాంగం 24గంటలు అందుబాటులో ఉండి అప్రమత్తంగా ఉంటుందని,అత్యవసర సమయంలో వెంటనే డయల్100 లేదా112కు సమాచారం అందించాలని తెలిపారు.మండపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ శాఖ నిబంధనలకు లోబడి ఉత్సవాలు నిర్వహించాలని సిఐ సూచించారు.
